ముగిసిన ఆనం వివేకానంద రెడ్డి అంత్యక్రియలు

Thursday, April 26th, 2018, 09:39:58 PM IST


నెల్లూరు సీనియర్ రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి తుది శ్వాసను విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఘనంగా అశ్రునయనాల మధ్య ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. గత కొంత కాలంగా ప్రోస్టేట్ కేన్సర్ తో బాధపడుతూన్న ఆనం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన ఆస్పత్రిలో ఉండగానే రాజకీయ నేతలు చాలా మంది కలుసుకున్నారు. ఆయన కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. ఇక నెల్లూరులోని పెన్నానది ఒడ్డున బోడిగాడి తోట వద్ద ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలను జరిపారు. కుటుంబ సభ్యులు సీనియర్ రాజకీయ నాయకులు అలాగే సన్నిహితులు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. చాలా మంది ఆనంతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments