విషమంగా మారిన ఆనం వివేకానంద రెడ్డి ఆరోగ్యం

Monday, April 23rd, 2018, 05:39:03 PM IST

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నియోజక వర్గంలో కీలక నేతగా ఎదిగిన ఆనం వివేకానందరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులకు కౌంటర్లు వేయడంలో ఆయనకు ఎవరు పోటీరారు. అయితే గత కొంత కాలంగా ఆనం వివేకానందరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. అందుకు కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కీమ్స్ లో రేడియేషన్ చిక్కిత్స అందిస్తున్నారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాస్పిటల్ కి వచ్చి ఆయన పరిస్థితి గురించి తెలుసుకున్నారు. డాక్టర్స్ తో మాట్లాడి ఆనం కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ప్రత్యేకంగా చిక్కిత్స అందిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో నెల్లూరు జిల్లాలో సీనియర్కొ నేతగా కొనసాగిన ఆనం ఆ తరువాత తెలుగు దేశం పార్టీలో చేరారు.

  •  
  •  
  •  
  •  

Comments