చంద్రబాబు సమాధానంతో మహీంద్రా షాక్..!

Friday, January 26th, 2018, 12:44:46 AM IST

అమరావతికి తానే బ్రాండ్ అంబాసిడర్ అని, ఆంద్రప్రదేశ్ కు తాను సీఈవో అని చెప్పుకునే చంద్రబాబు విజన్ కు దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం దావోస్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాకు చెందిన బినిజెస్ మాన్ లు సైతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామిక వేత్తలతో ప్యానల్ చర్చలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. మీ విజన్ ఏంటని మహీంద్రా చంద్రబాబుని ప్రశ్నించారు. ఏపీని ప్రపంచంలో ఆదర్శవంతమైన రాజధానిగా తీర్చి దిద్దడం అని తెలిపారు. మనదేశానికి ఆదర్శం కాదా అని మహీంద్రా తిరిగి ప్రశ్నించారు. మరో రెండేళ్లలో అమరావతిని ఇండియాకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దీనితో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కు మహీంద్రా ఆశ్చర్యపోయారు. మోడ్రన్ ఇండియాలో చంద్రబాబు ఆదర్శవంతమైన నాయకుడని ప్రశంసల వర్షం కురిపించారు.