అనంత‌పురం జిల్లా : టీడీపీ, వైసీపీ హోరాహోరీ.. చివ‌రికి గెలుపు ఎవ‌రిదో.. తేల్చిన సెన్షేష‌న్ స‌ర్వే..!

Monday, April 22nd, 2019, 08:07:14 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఎవ‌రికి వారు అధికారం త‌మ‌దే అని ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ మ‌రోసారి అధికారం త‌మ‌దే అని చెబుతుంటే.. అంత సినిమా లేదు కాసుకోండి ఈసారి గెలిచేది తామే అని వైసీపీ అంటుంది. ఇక జ‌న‌సేన పార్టీ కూడా తామే అధికారంలోకి వ‌స్తామ‌ని అంటున్నారు. మ‌రి ఓట‌ర్లు ఏ పార్టీ వైపు నిలిచారో తెలియాలంటే మే 23న రానున్న‌ ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కు ఆగాల్సిందే.

అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాజ‌కీయ‌విశ్లేష‌కులు జిల్లాల వారిగా ఇప్పటికే ఏ పార్టీ పై చేయిలో ఉందో అని అంచ‌నాలు వేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం జాతీయ స‌ర్వేలు విడుద‌లకాక పోయినా, లోక‌ల్ స‌ర్వేలు మాత్రం సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన వారు, ఆ పార్టీకి అనుకూలంగా లెక్క‌లు వేసుకుని స‌ర్వేలు విడుద‌ల చేసినా, కొన్ని స‌ర్వేలు మాత్రం, విశ్లేష‌కులు అంచ‌నాలు, జాతీయ స‌ర్వేల అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా అనంత‌పురం జిల్లాకు సంబంధించిన స‌ర్వే ఒక‌టి సోష‌ల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. మ‌రి ఆ స‌ర్వే లెక్కులు ఏంటో చూద్దామా.

## అనంతపురం జిల్లా మొత్తం అసెంబ్లీ సీట్లు.. 14 సీట్లు

1. కదిరి – వైసీపీ

2. పుట్టపర్తి – వైసీపీ

3. రాప్తాడు – వైసీపీ

4. ధర్మవరం – వైసీపీ

5. ఉరవకోండ – టీడీపీ

6. మడకసిర – టీడీపీ

7. హిందూపూర్ – టీడీపీ

8. గుంతకల్లు – వైసీపీ

9. అనంతపూర్ ఆర్బన్ – వైసీపీ

10. తాడిపత్రి – టీడీపీ

11. రాయదుర్గం – వైసీపీ

12. సింగనమల – వైసీపీ

13 పెనుకోండ – టీడీపీ

14. కళ్యాణదుర్గం – టీడీపీ

ఇవండీ అనంత‌పురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. వాటిలో వైసీపీ 8 సీట్లు గెలిచే అవ‌కాశం ఉంద‌ని, టీడీపీ 6 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఆ స‌ర్వే అంచానా వేసింది. జ‌న‌సేన‌, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఖాతా కూడా తెరిచే అవ‌కాశం లేద‌ని, ముందునుండి చెప్పుకున్న‌ట్టు ప్ర‌ధాన పోటీ టీడీపీ, వైసీపీల మ‌ధ్యే అని, అయితే టీడీపీ కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో ఈసారి వైసీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆ స‌ర్వే తేల్చేసింది. ప్ర‌స్తుతం ఈ స‌ర్వే సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.