బుద్దుడి విగ్రహం ముందర అనసూయ హాట్ డ్యాన్స్ .. సమాధానం ఇలా చెప్పింది

Saturday, February 11th, 2017, 01:55:46 AM IST


సాయి ధరం తేజ సినిమా విన్నర్ కి సంబంధించిన ఒక ఐటెం సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి మంచి రియాక్షన్ వస్తున్న ఈ పాటలో సూయ సూయ అంటూ సుమ పాట పాడితే అనాసూయ ఈ పాటకి డాన్స్ చేసింది. ఈ పాట వీడియో లో గౌతమ బుద్ధుడు కనిపిస్తాడు. ఆయన విగ్రహం ముందర అర్ధనగ్నంగా డాన్స్ లు చెయ్యడం ఏంటి అని చాలా మంది యాంకర్ అనసూయ ని ఏకి పడేస్తున్నారు. వారందరికీ ఈ హాట్ బ్యూటీ సీరియస్ సమాధానం ఇచ్చింది. ‘ఈ స్పెషల్ సాంగ్ ను ఉక్రెయిన్ బుద్ధ బార్ అనే పేరు గల ఓ పబ్ లో చిత్రీకరించాం. అక్కడ అప్పటికే బుద్ధుడి విగ్రహం ఉంటుంది. మేమేదీ ఆ విగ్రహం ఏర్పాటు చేయలేదు. గూగుల్ కి వెళ్లి బుద్ధ బార్స్ గురించి ఎంక్వైరీ చేసుకుంటే.. ఈ బుద్ధ బార్స్ చెయిన్ గ్రూప్ గురించి తెలుస్తుంది’ అంటూ క్లారిఫై చేసిన అనసూయ.. ఆ తర్వాత డోస్ పెంచేసింది.’అక్కడి జనాలకు బుద్ధుడి విగ్రహం ముందు పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేసుకోవడానికి ఇబ్బంది లేనపుడు.. పాట తీస్తే తప్పేంటట? మా ఉద్దేశ్యం జనాలను ఎంటర్టెయిన్ చేయడమే’ అంటోంది