న్యూస్ ఛానల్ సాక్షిగా యాంకర్ల యుద్ధం!

Tuesday, February 27th, 2018, 12:13:28 AM IST

న్యూస్ ఛానల్ సాక్షిగా ఇద్దరు యాంకర్లు ఒకరి పై ఒకరు ప్రసస్పర దూషణలతో మాటల యుద్ధం కొనసాగించారు. వీరిద్దరి మాటల యుద్దమ్ తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. అయితే యిడిజరిగింది మన ఇండియా లోని న్యూస్ చానెల్స్ లో కాదండోయి, పాకిస్తాన్‌లోని లాహోర్ కేంద్రంగా పని చేస్తున్న సిటీ 42 అనే ఛానల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వార్తల సమయంలో దొరికిన చిన్నపాటి బ్రేక్‌లో మొదట మేల్ యాంకర్, ఫిమేల్ యాంకర్‌పై మాటల యుద్ధం ప్రారంభించాడు. అలా ఒకరినొకరు తిట్టుకుంటూ చేస్తున్న పనినే మర్చిపోయారు.

హఠాత్తుగా ఈమెతో నేనెట్లా బులిటెన్‌ చేయను అంటూ మండిపడ్డాడు మేల్ యాంకర్. దీనికి పక్కనే ఉన్న మహిళా యాంకర్‌ స్పందిస్తూ నాతో మాట్లాడకు అంటూ కాస్త గట్టిగా రిప్లై ఇచ్చింది. దానికి నేను నీ వాయిస్ గురించి మాట్లాడతున్నా అని మగ యాంకర్ అనగా, మర్యాదగా మాట్లాడు అంటూ ఫిమేల్ యాంకర్ గద్దించడం మొదలెట్టడంతో వీరిద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. చివరకు ఇలా సాగిన ఈ వీడియోను ఆ ఛానల్ కు చెందిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. నిజానికి ఇది వారిరువురు మాటలతో తిట్టుకున్నప్పటికీ చూపరులకు మాత్రం నవ్వులు పువ్వులు పూయిస్తోంది…