అందరూ దొంగలే..బ్యాంకు మేనేజర్ నుంచి స్వీపర్ వరకూ..!!

Thursday, December 29th, 2016, 03:58:33 PM IST

arrest
ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టుకోలేడన్న సామెత ఉంది..ప్రస్తుతం దేశం లో పెద్ద నోట్ల రద్దు పరిస్థితి అలాగే ఉంది. ఆర్బీఐ అధికారులు మొదలుకుని, బ్యాంకు మేనేజర్లు, స్వీపర్ల వరకూ అందరూ డబ్బు అక్రమంగా సంపాదించడానికి దీనిని ఓ ఆయుధంలా వాడుతున్నారు. పాత నోట్లని మార్చడం లో అందరూ వారి చేతి వాటాన్నిప్రదర్శిస్తున్నారు.దీనితో సూర్యాపేట లోని మఠం పల్లి ఆంధ్ర బ్యాంకు క్యాషియర్, స్వీపర్ లు కమిషన్ లకు కరెన్సీ ని మారుస్తూ పోలీస్ లకు చిక్కారు.ఆ బ్యాంకులో డానియెల్ అనే వ్యక్తి ఎలెక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. దీనితో క్యాషియర్ రవీందర్ రెడ్డి కి డానియెల్ తో నోట్ల మార్పిడి పై ఒప్పందం జరిగింది. అదేవిధంగా రవీందర్ రెడ్డి అదేబ్యాంకులో స్వీపర్ మాథ్యూస్ తోకూడా నగదు మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

వారి నగదు మార్చడానికి రవీందర్ రెడ్డి ఫేక్ అకౌంట్ లను క్రియోట్ చేశాడు. అక్రమంగా నగదుని మార్చుకోవాలనుకునే వారిని డానియెల్..రవీందర్ రెడ్డి కి పరిచయం చేసేవాడు. అలా ఫేక్ అకౌంట్ లను క్రియోట్ చేసి రూ 2 లక్షల కొత్త నోట్లని తన కారులో తరలిస్తుండగా పోలీస్ లకు చిక్కాడు. ఎస్ ఐ రంజిత్ రెడ్డి హుజూర్ నగర్ వైపుగా వస్తున్న రవీందర్ రెడ్డి కారు ని ఆపి తనిఖీలు చేయగా అతడి వద్ద రూ 2 లక్షల కొత్త నోట్లు లభించాయి. దీనితో పోలీస్ లు అతడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అతడి ఇంట్లో కూడా రూ 3 లక్షల కొత్త కరెన్సీ లభించడం విశేషం. రవీందర్ రెడ్డి 19 శాతం కమిషన్ లకు నగదుని మారుస్తున్నట్లు పోలీస్ లు గుర్తించారు. దీనితో పోలీస్ లు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments