ఆ నిరసనలకు తాముభద్రతా కల్పించలేమన్న ఆంధ్రా డీజీపీ

Tuesday, January 24th, 2017, 05:19:52 PM IST

dgp-sambha-siva-rao
ఇప్పటికే ఈ నెల 26న ఆంధ్ర తెలుగు యువత చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి, అలాగే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించే కార్యక్రమానికి ఇప్పటినుండే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ లాంటి నటులు ఇప్పటికే తాము ప్రత్యక్షంగా ఆ ఆందోళనల్లో పాల్గొంటామని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేహ్స్ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ… ఈ ఆందోళన కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇంత తక్కువ సమయంలో భద్రతా కల్పించడం కుదరదని ఆయన అన్నారు. తాము భావప్రకటనా స్వేచ్ఛలకు భంగం కలిగించమని, కానీ 26న తలపెట్టే ఆందోళనలకు అనుమతి ఇవ్వలేమని, తాము సుప్రీమ్ కోర్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నామని, మేము ఎవరికీ వ్యతిరేకం కాదని, భాద్యత తీసుకోవాలనుకునే వ్యక్తులు తమ దగ్గరకు రావాలని డీజీపీ అన్నారు.

అనుమతి, ఏర్పాట్లు, సెక్యూరిటీ లేని నిరసనలకు తాము అనుమతి ఇవ్వలేమని, సోషల్ మీడియా వేదికగా చేసే నిరసనలు కరెక్ట్ కాదని, సోషల్ మీడియాలో ఎవరు ఎక్కడి నుండి మెసేజ్ పెడుతున్నారో తెలీదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ఉన్న మెసేజీ లకు ఎవరు రియాక్ట్ కావొద్దని చెప్పారు. అంతిమంగా తమ ప్రాధాన్యం శాంతిభద్రతలకేనని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.