బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రుడు బ‌హిరంగ లేఖ.. చంద్ర‌బాబూ గెలిచినా రాజీనామా చేస్తాడా..?

Monday, April 15th, 2019, 06:51:40 PM IST

ఎన్నిక‌ల యంత్రాంగ‌మంతా ఫెయిల్ అయింది.., అరాచ‌కం జ‌రిగిపోయింది.., అడ్డ‌గోలుగా ఓటింగ్ జ‌రిగింది.., అస‌లు ఈవీఎంలు ప‌నిచేస్తున్నాయో లేదో తెలీయ‌డం లేదు.., త‌న ఓటు త‌న‌కే ప‌డిందో ఏదో తెలీయ‌డం లేదని ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు తాను ఓటు వేసిన అనంత‌రం పోలింగ్ కేంద్రం నుంచి మీడియాతో అన్న మాట‌లు.

చ‌ంద్ర‌బాబు స‌మాధానం చెప్పు..!

వాస్త‌వంగా ఓట‌రు త‌న హ‌క్కును స‌ద్వినియోగం చేసుకునే స‌మ‌యంలో ఈవీఎంపైనున్న పార్టీలకు సంబంధించి ఏదో ఒక గుర్తుపై ఫింగ‌ర్‌తో నొక్కిన త‌రువాత ప‌క్క‌నే ఉన్న వీవీ ప్యాట్‌ల‌ను చూస్తే ఓటు వారు వేసిన పార్టీకే ప‌డిందా..? లేదా..? అనేది తెలుస్తుంది. కానీ, చంద్ర‌బాబు అలా చూసుకోక‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన‌టువంటి ప్ర‌శ్నే త‌న ఓటు త‌న‌కే ప‌డిందో.. లేదో అన్న‌ది. త‌న నోటు త‌న పార్టీకే ప‌డిందో లేదో తెలీయ‌డం లేదంటూ స్వ‌యాన ఒక ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం.

చ‌ంద్ర‌బాబు స‌మాధానం చెప్పు..!

ఒక‌ప‌క్క ఎన్నిక‌ల యంత్రాంగ‌మంతా టీడీపీకి వ్య‌తిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ప‌నిచేశాయి అని చంద్ర‌బాబు అంటూనే త‌న టీడీపీ పార్టీకి 130 సీట్లు వ‌స్తాయంటున్నారు. మ‌రోప‌క్క ఈవీఎంల‌న్నీ ప‌నికిమాలిన‌వి.., అదైపోతాయి.., ఇదైపోతాయి.., అన్న త‌ర‌హా స్టేట్‌మెంట్‌లను చంద్ర‌బాబు ఇచ్చారు. అయినా ఇక్క‌డ చంద్ర‌బాబు మ‌రిచిన అంశ‌మేమిటంటే..? గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే ఈ ఏడాది
రెండు శాతం ఓటు శాతం పెరిగిందన్న‌ది.

ఈ లెక్క‌న చంద్ర‌బాబు దృష్టిలో ఎన్నిక‌ల సంఘం ఫెయిల్ అయిన‌ట్టా..? స‌క్సెస్ అయిన‌ట్టా..? గ‌త ఎన్నిక‌ల్లో ఆరు, ఆరున్న‌ర గంట‌లకు పోలింగ్ క్లోజ్ అయ్యేది. అలాంటి ఏప్రిల్ 11న రాత్రి వ‌ర‌కు ఎన్నిక‌ల సంఘం ఉండి మ‌రీ ఓట‌ర్లు త‌మ హ‌క్కును స‌ద్వినియోగం చేసుకునేలా స‌హ‌క‌రించింది. అంటే అక్క‌డ ఎన్నిక‌ల సంఘం ఫెయిల్ అయిన‌ట్టా..? స‌క్సెస్ అయిన‌ట్టా..? ఎన్నిక‌ల సంఘం ప‌నిచేసిన‌ట్టా..? ప‌నిచేయ‌న‌ట్టా..?

చ‌ంద్ర‌బాబు స‌మాధానం చెప్పు..!

ఇదిలా ఉండ‌గా, చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన ప్ర‌తి మీడియా స‌మావేశంలో టీడీపీకి 130 సీట్లు వ‌స్తాయంటున్నాడు.., చంద్ర‌బాబు అంటున్న‌ట్టు ఎన్నిక‌ల సంఘం, కేసీఆర్‌, జ‌గ‌న్‌, మోడీ వీళ్లంద‌రూ క‌లిసిపోయి ఈవీఎంల‌ను మాన్యుప్యులేట్ చేశార‌ని చెబుతున్న చంద్ర‌బాబు, మ‌ళ్లీ టీడీపీ 130 సీట్ల‌ను గెలుపొందుతుంద‌ని ధీమాగా ఎలా చెబుతున్నావు..? అంటే ప్ర‌ధాని మోడీ నీతో కుమ్మ‌క్క‌య్యాడా..? మీరిద్ద‌రూ క‌లిసి కుమ్మ‌క్కై బ‌య‌ట‌కు రాకుండా డ్రామా ఆడి ఇదంతా చేశారా..?

చ‌ంద్ర‌బాబు స‌మాధానం చెప్పు..!

మ‌రి నీవు ముందుగా చెప్పిన‌ట్టు కేసీఆర్‌, జ‌గన్‌, మోడీ క‌లిసి ఈవీఎంల‌ను మాన్యుప్యులేట్ చేసి ఉంటే.. పొర‌పాటును నీవు ఎన్నిక‌ల్లో గెలిస్తే.. నిన్ను అన‌వ‌స‌రంగా గెలిపించార‌ని రాజీనామా చేస్తావా..? చ‌ంద్ర‌బాబు స‌మాధానం చెప్పు..! అంటే ఓడిపోతే స‌మాధానం చెప్పుకోవ‌డానికే ముందుగా ఈ స్టేట్‌మెంట్
ఇచ్చావా..?

స‌రే వాట‌న్నిటిని ప‌క్క‌న పెట్టేద్దాం. ఈ ప్రశ్న‌ల‌కు స‌మాధానం చెప్పు..

నీవు చెప్పిన‌ట్టు టీడీపీకి 130 సీట్లు రావాలి అంటే ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగిన‌ట్టు ఒప్పుకోవాలి.
లేదా 130 సీట్లు ఓడిపోతామ‌ని ఒప్పుకోవాలి.
ఒక ప‌క్క గెలుస్తామ‌ని చెబుతానే.. మ‌ళ్లీ అవ‌క‌త‌వ‌క‌లు అంటే ఎలా చంద్ర‌బాబు..!
ఏదో ఒక మాట‌పై నిల‌బ‌డి ఉండాలి క‌దా..! అది నీ 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలోనే లేదంటావా మ‌రీ..! అంతేగా.. అంతేగా..!