తెలంగాణ కి కూడా కొంత సమయం కేటాయించండి : చంద్రబాబుకు ఎల్ రమణ విజ్ఞప్తి

Wednesday, January 17th, 2018, 12:11:39 PM IST

తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ నేడు అమరావతి విచ్చేసారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు, అక్కడ చంద్రబాబుతో అరగంట పాటు మంతనాలు జరిపిన ఆయన ఆంధ్రాలో పర్యటిస్తున్నట్లు గానే, చంద్రబాబు కొంత సమయాన్ని తెలంగాణ కి కూడా కేటాయించి ఇక్కడ కూడా పార్టీ ని ముందుండి నడిపించాలని, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. గురువారం నుండి తెలంగాణ లో ప్రారంభం కానున్న పల్లె పల్లెకి టిడిపి కార్యక్రమం లో తన వీలు చూసుకుని పాల్గొనాలని ఆయన్ని కోరినట్లు, దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు చెపుతున్నారు. రేపటి యన్ టి ఆర్ వర్ధంతికి జరుగుతున్న ఏర్పాట్లు, రక్తదాన శిబిరాల ఏర్పాట్ల గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లుతెలుస్తోంది. ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని అక్కడి టిటిడిపి నేతలందరినీ కలుపుకుని విజయవంతం చేసేలా చూడాలని ఎల్ రమణను బాబు కోరినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై దృష్టిసారించిన చంద్రబాబు కాస్త తెలంగాణ లో కూడా టిడిపి పరిస్థితి ని పట్టించుకుని తన వంతుగా కృషి చేస్తే కార్యకర్తల్లో నూతనోత్సవాహం వస్తుందని విశ్లేషకులు అంటున్నారు…