ఏపీలో మొదలైన బంద్.. ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా?

Monday, April 16th, 2018, 08:33:51 AM IST

ప్రత్యేక హోదా కోసం ఆంద్రప్రదేశ్ నేతలు ఇన్ని రోజులు ఎవరి స్థాయిలో వారు పోరాటాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ నుంచి ఎపి గల్లీ వరకు ప్రత్యేక నినాదాలతో జనాలను బాగానే ఆకర్షించారు. కానీ అందుకు ఎటువంటి లాభం లేకపోయింది. భవిష్యత్తులో కూడా ఎంత వరకు లాభాన్ని ఇస్తుందో ఎవ్వరు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అనే విధంగా ప్రతి ఒక్క పార్టీ చాలా కష్టపడుతోంది. అయితే పోరాటాల తరువాత ఇప్పుడు బంద్ ఫార్మములను అమలు చేస్తున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలాగైనా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో బంద్ నేడు ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచే స్టార్ట్ కావడంతో రాష్ట్రంలో నిర్మానుషమైన
వాతావరణం కనిపించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు మొత్తం బంద్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో కొన్ని చోట్ల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతగా జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా బంద్ లో పాల్గొన్నాయి. ఇక పాటిటెక్నిక్ పరీక్షలను వాయిదా వేశారు.