ఏపిలో బిజేపి సరికొత్త ప్లాన్!

Sunday, May 13th, 2018, 05:07:12 PM IST

దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతోన్న బీజేపీ మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో కూడా తన స్థానాలను బలపరచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకుంటున్న భారత జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కూడా తన బలాన్ని పెంచుకోవాలని కృషి చేస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ గుర్తింపు చాలానే కిందకు పడిపోయింది. అయితే ఆ సమయంలో ఏపి భాజపా సభ్యులు విమర్శలను తిప్పి కొట్టడంలో చాలా రకాలుగా విఫలమయ్యారు. దీంతో అధిష్టానం ఇక నుంచి పార్టీ తక్కువకాకుండా జాగ్రతలు తీసుకోవడం మొదలు పెట్టింది. ముందుగా ఏపి అధ్యక్ష పదవిని సీనియర్ నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేసింది. పూర్తి బాధ్యతలు ఆయనకు అప్పగించి పార్టీని బలోపేతం చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొందరు సీనియర్ రాజకీయ నాయకులు కన్నా లక్ష్మీనారాయణతో ముందుగానే సంప్రదింపులు చర్చలు మొదలు పెట్టారు.

Comments