ఏపీ బిగ్‌వార్.. ప‌ర్ఫెక్ట్ ఎనాలిసిస్.. లోక‌ల్ స‌ర్వే అవుట్.. ఆ పార్టీకి సీన్ సితారే..!

Tuesday, April 23rd, 2019, 06:51:51 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నికల తర్వాత.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే విషయం ఉత్కంఠగా మారింది. ఇప్ప‌టికే టీడీపీ, వైసీపీలు గెలుపు త‌మ‌దేన‌ని మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే ఎక్కువ సీట్లు త‌మ‌కే వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీకి 120 సీట్లు ప‌క్కాగా వ‌స్తాయ‌ని ప‌లు స‌ర్వేలు స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా అధికారంలోకి తామే వ‌స్తామ‌ని ధీమాతో ఉన్నారు.

మ‌రోవైపు టీడీపీకి వ్య‌తిరేకంగా స‌ర్వేలు వ‌చ్చినా, 2014లో కూడా అన్ని స‌ర్వేలు వైసీపీకి అనుకూలంగానే వ‌చ్చాయ‌ని, చివ‌రికి తామే గెలిచామ‌ని 2019లోకూ అదే సీన్ రిపీట్ అవుతోంద‌ని, మ‌రోసారి టీడీపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు స‌ర్వేలు త‌మ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ‌లేపుతున్నారు.

ఈ క్ర‌మంలో లోక‌ల్ మీడియా ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన త‌ర్వాత ఓట‌ర్లు నాడి ఎటువైపు ఉందో అనే విష‌యం పై స‌ర్వే నిర్వ‌హించింది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ లోక‌ల్ మీడియా టీమ్ వివ‌రాలు సేక‌రించి తాజాగా ఆ స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇక ఆ స‌ర్వే ఫ‌లితాలు చూస్తే.. తెలుగుదేశం పార్టీ ఆసారి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కాక త‌ప్ప‌ద‌ని, టీడీపీకి 68 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ని ఆ స‌ర్వే అంచానా వేసింది.

ఇక వైసీపీ 102 స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆ స‌ర్వే తేల్చి చెప్పిది. అలాగే జ‌న‌సేన పార్టీ 5 స్థానాల్లో మాత్రమే విజ‌యం సాధిస్తుంద‌ని, ఇక కాంగ్రెస్ బీజేపీలు ఒక్క‌సీటు కూడా ద‌క్కించుకునే అవ‌కాశం లేదని ఆ స‌ర్వే తేల్చి చెప్పింది. దీంతో ఎన్ని సర్వేలు వ‌చ్చినా, ఆ ఫ‌లితాలు మాత్రం వైసీపీకే అనుకూల‌గా ఉన్నాయని, మ‌రి ఓట‌ర్లు ఎవ‌రికి అధికారం క‌ట్ట‌బెడ‌తారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.