అప్పుల్లో ఏపీ… అసలేం జరుగుతుంది..?

Friday, March 9th, 2018, 02:55:56 PM IST

అభివృద్ధి బాట పట్టిన ఏపీ ఇప్పుడు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.. ప్రతీ ఏడాది వచ్చే రాబడుల కన్నా చేసే ఖర్చులు ఎక్కువతున్నాయి. దీని కారనంగాన్ ఏపీ ప్రభుత్వం మొత్తానికి మొత్తంలో అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇవి కూడా వేస్కున్నఅంచనాలను మించిపోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏపీ సుమారు 2,49,435 కోట్లకు ఈ అప్పుల భారాన్ని మోయాల్సి వస్తుందని అంచనా వేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి రుణాలు సంపాదించే క్రమంలో కొత్త మార్గాలు అన్వేషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలా పడితే అలా అప్పులు చేస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌లకు అప్పులు తీసుకునేందుకు మంత్రిమండలిలో ఆమోదం పొంది… వాటి పరిమితిని పెంచి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతోంది. ఆ రుణాలను పీడీ ఖాతాలకు రప్పిస్తూ అక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుని ఖర్చు చేస్తోంది.

రాష్ట్రం చేసే ఉత్పత్తిలో కుడా హెచ్చు తగ్గులే..
సాధారణంగా ప్రతీ రాష్ట్ర అప్పులను ఆ రాష్ట్రం యొక్క స్థూల జాతీయోత్పత్తితో పోల్చి చుస్తే, అప్పుడు ఆ రాష్ట్ర అప్పుల వాటా తగ్గుతూ… పెరుగుతూ వస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 28.25 శాతానికి ఇది చేరగా… ఆ తర్వాత 28.50 శాతానికి, 2016-17 సంవత్సరంలో ఇది గరిష్ఠంగా 28.79శాతానికి చేరింది. 2017-18లో సవరించిన అంచనాలను పరిశీలిస్తే మళ్లీ అప్పుల భారం స్థూల ఉత్పత్తితో పోలిస్తే కొంత తగ్గింది. అది 28.40శాతానికి చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరికొంత పెరిగి 28.66శాతం వద్దకు చేరుతుందని ఆర్థిక శాఖ అంచనాలు రూపొందించింది.

రెవెన్యూలోటు సర్దుబాటు విషయానికొస్తే అసలు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. 2014-15లో రాష్ట్రం రెవెన్యూ లోటును రూ.16079 కోట్లుగా లెక్కించింది. దానిని కేంద్రం భర్తీ చేయాలని కోఆంక్షలు విధించింది. ఈ విషయంలో ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన మాట లేకపోవడం వాళ్ళ రాష్ట్రం ఏ ఆధారాలు చూపి అడుగుతున్నా…ఇక్కడి నుంచి ఆర్థికశాఖ అధికారులను పంపి చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన రెవెన్యూ రాబడులను పరిగణనలోకి తీసుకుని ఏర్పడిన లోటును వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని…. పింఛన్లు, రుణమాఫీ, పీఆర్‌సీ బకాయిలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది.

ఉద్యోగులకు జీతాలు కుడా సరిగా లేవు…
కేంద్రప్రభుత్వంకి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఆశించిన సమయంలో పన్నుల వాటా రాకపోవడంతో, ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి ఉద్యోగులకు నెలసరి జీతం చెల్లింపుల భారం రాష్ట్రంపై ఎక్కువగా ఉండటంతో సతమతమవుతున్నపరిస్థితులు ఎదురయ్యాయి. కొన్ని సందర్బాలలో ఉద్యోగుల జీతభత్యాలు, బిల్లుల చెల్లింపులకూ సమస్యలు ఎదురవుతున్నా, సిబ్బంది జీతాలు, సామాజిక, ఇతర పింఛన్లు, ఇతరత్రా రాయితీల కోసమే ప్రతి నెలా రూ.4500 కోట్లు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు అప్పులకు ప్రతి నెలా వడ్డీలు చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రుణాలు దాదాపు రూ.24 వేల కోట్ల వరకు ఉన్నట్లు లెక్కిస్తున్నారు. ఇలా చూసుకుంటూ పొతే రాష్ట్రానికి అభివృద్ధి కంటే అప్పులే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ పాలన చూసే కేంద్రం ఎపీని సరిగా పట్టించుకోవడం లేదేమో అని వామపక్షాలు అంటున్నాయి.