చితక్కొట్టిన రస్సెల్‌.. షాకైన ధోని

Tuesday, April 10th, 2018, 10:07:17 PM IST

క్రికెట్ లో మొదటి సారి అభిమానులకు అసలైన కిక్కు దొరికింది. బ్యాట్ కు అసలైన పూనకం వస్తే ఎలా ఉంటుందో కోల్ కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ కరెక్ట్ గా చూపించాడు. బాల్ వేసిన సెకనుకే బౌండరీ అవతల కనిపించింది. చెన్నై – కోల్ కతా మధ్య జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో దినేష్ కార్తీక్ సేన ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ గెలిచి చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతా ను చెన్నై మొదటి నుంచి దెబ్బ తీస్తూనే వచ్చింది. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా ఆండ్రూ రస్సెల్‌ బ్యాటింగ్ కు దిగి చెన్నై బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అతని షాట్లకు వికేట్స్ వెనకాల ఉన్న ధోని షాక్ అవుతూనే ఉన్నాడు. ఏ మాత్రం జాలి లేకుండా రస్సెల్‌ 11 సిక్సులు 1 ఫోర్ కొట్టి 36 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని కూడా రస్సెల్‌ సిక్స్ గా మలిచి జట్టు స్కోరును 202 తెచ్చాడు.