ఎఫ్2 టాక్: రావిపూడి మరో జంధ్యాల, ఈవీవీ..!

Saturday, January 12th, 2019, 04:10:28 PM IST

టాలీవుడ్ లో 1980, 90ల కాలంలో కామెడీ చేయాలంటే ప్రధమంగా జంధ్యాల, ఈవీవీల పేర్లే వినిపించేవి. అప్పట్లో హాస్యం హాస్యం లాగే ఉండేది, కేవలం కథలో భాగంగానే కామెడీ ఉండేది తప్ప బలవంతంగా ఇరికించే కామెడీ ట్రాక్ లు ఉండేవి కావు. అయితే ఈవీవీ, జంధ్యాల తర్వాత అలాంటి కామెడీ కరువైపోయింది, ఆ స్థాయిలో కామెడీ పండించగల దర్శకులు కూడా కరువైపోయారు. అయితే మళ్లీ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి ఆ ఇద్దరు దర్శకులను గుర్తు చేస్తున్నారు. అయన ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాలో కామెడీయే హైలైట్ గా నిలిచింది. వరుణ్ తేజ్, వెంకటేష్ ల కాంబినేషన్ లో అణిరావిపూడి డైరెక్షన్ లో ఎఫ్2 సినిమా ఈ సంక్రాతి సందర్బంగా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

ఎఫ్2 లో ముఖ్యంగా కామెడీ హైలైట్ అని అంటున్నారు. పెళ్ళికి ముందు, ఆ తర్వాత అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను అనిల్ చక్కగా డీల్ చేసాడని, అటు ఆడవారికి, ఇటు మగవారికి నచ్చేలా చాలా తెలివిగా కథను నడపగలిగాడని అంటున్నారు. కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకొని మరి నవ్వుకునేలా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఒక సీన్లో కుక్కల బారి నుండి వెంకటేష్ తప్పించుకునే ఎపిసోడ్ కడుపుబ్బా నవ్వుకునేలా ఉందని అంటున్నారు. మొత్తానికి మూడు వరుస హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి తర్వాత ఎలాంటి సినిమాలు చూడాలి.