టీమిండియాకు షాక్.. మరో ఇద్దరు కూడా ఔట్!

Thursday, September 20th, 2018, 05:35:26 PM IST

ఆసియా కప్ లో వరుసగా రెండు విజయాలతో ఉత్సాహం మీదున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. బుధవారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తూ మ్యాచ్ మధ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. వెంటనే అతనికి రెస్ట్ ఇచ్చారు. ఇక మరో ఇద్దరు ప్లేయర్లు కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఫీల్డింగ్ చేసే సమయంలో అక్షర్ పటేల్ చూపుడు వేలుకు తీవ్రంగా గాయమైంది. స్కానింగ్ లో దెబ్బ తీవ్రతను పరిగణలోకి తీసుకొని అతనికి కూడా రెస్ట్ ఇచ్చారు.

ఇక ఫాస్ట్ బౌలర్ శార్దూల్‌ ఠాకూర్‌ కూడా గాయమైంది. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో తొడ కండరాలు పట్టేయడంతో అతను కూడా టోర్నీ నుంచి దూరమవుతున్నట్లు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నారు. వీరి స్థానంలో దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, సిద్దార్థ్ కౌల్ లను జట్టులోకి తీసుకున్నారు. ఇక సూపర్ ఫోర్ లో భాగంగా శుక్రవారం టీమిండియా జట్టు బాంగ్లాదేశ్ ను ఎదుర్కోనుంది. సూపర్ ఫర్ లో పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ జట్లతో కూడా ఇండియా తలపడనుంది. సూపర్ ఫోర్ లో టాప్ 2 టీమ్స్ ఫైనల్ ఆడతాయి.