జియోకు పోటీగా ఎయిర్ టెల్ మరొక అద్భుత ప్లాన్!

Tuesday, May 15th, 2018, 02:59:27 AM IST

ఇప్పటికే టెలికాం రంగంలోకి జియో రాకతో ఇంటర్నెట్, కాల్స్, ఎస్ఎమ్ఎస్ ల ముఖ చిత్రమే మారిపోయింది. నిజానికి ఒకప్పుడు రూ. 200 పైబడి వుండే 1జిబి ఇంటర్నెట్ నేడు జియో రాకతో అతి చవకగా అందరికి అందుబాటులోకి వచ్చింది. అయితే మిగిలిన టెలికాం కంపెనీలు కూడా తమ కస్టమర్ లను ఆకట్టుకునేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. గవర్నమెంట్ సంస్థ బిఎస్ఎన్ఎల్ సహా పలు సంస్థలన్నీ కూడా ఎప్పటికప్పుడు పోటీని తట్టుకునేందుకు రక రకాల ప్లాన్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే జియోకి ఎప్పటికప్పుడు గట్టిపోటీ ని ఇస్తోంది మాత్రం ఎయిర్ టెల్ అని చెప్పుకోవాలి.

ఇప్పటికే దాదాపుగా ఎయిర్ టెల్, జియో ప్రకటిస్తున్న ఆఫర్లకు దాదాపుగా సరిసమానమైన ఆఫర్లు ప్రకటిస్తూ దూసుకుపోతోంది. ఇక తాజాగా జియోకి గట్టి దెబ్బ తగిలేలా రూ.149 ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం 28 రోజుల వాలిడిటీతో రోజుకి 1జిబి ఇంటర్నెట్ సౌకర్యం, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తోపాటు రోజుకి 100 ఎస్ఎమ్ఎస్ ల సౌకర్యాన్ని అందించనుంది. అయితే ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో వున్న ఈ ప్లాన్, మరికొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా అందరికి అందుబాటులోకి రానుంది అని సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు…….