కొండగట్టు ప్రమాదం : కొత్త కోణం.. వివరించిన బాధిత బాలిక!

Thursday, September 13th, 2018, 03:15:54 PM IST

ఇటీవల తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామన్నా వారందరూ కనిపించని లోకాలకు వెళ్లిపోయారు. చిన్నారులు మహిళలు ఎక్కువగా మృత్యువాత పడటం ప్రతి ఒక్కరి గుండెను తడి చేసింది. మరణించిన వారి కుటుంబ సభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. కొండగట్టు దారులపై డ్రైవర్ కు సరిగ్గా అవగాహనా లేకపోవడం కూడా ఘటనకు మరో కారణం. మొత్తంగా ఈ ప్రమాదంలో 60 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఘటనకు సంబందించిన మరో కొత్త విషయం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది.
తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన బాలిక సోమిడి అర్చన (13) ప్రమాదం గురించి వివరించింది. ఈ ఘటనకు అసలు కారణం బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడమేనని బాలిక చెబుతోంది. బ్రేకులు పనిచేయకపోవడంతో దూకేవారు దూకేయాలని డ్రైవర్ ఒక్కసారిగా గట్టిగా అరిచేశాడని అతని మాటలకూ అందరూ ఉలిక్కి పడి కేకలు వేశారని తెలిపింది. అయితే భయంతో ఒక వ్యక్తి బయటకు దూకేసినట్లు కూడా బాలిక తెలిపింది. ఇక ప్రమాదంలో బాలిక తల్లి మరణించింది. అయితే తన తల్లికి అంతకుముందే డ్రైవర్ తో గొడవైందని బస్సు ఆపితే కిందకు దిగిపోతామని చెప్పినప్పటికీ డ్రైవర్ వినలేదని, అతను బస్సు ఆపి ఉంటే తన తల్లి బ్రతికి ఉండేదని బాలిక తెలియజేసింది.

  •  
  •  
  •  
  •  

Comments