‘బిజినెస్ మేన్’ చేతికి మరో బిగ్ బ్రాండ్..!

Saturday, June 8th, 2013, 04:59:29 PM IST


ఓ వైపున భారీ బడ్జెట్ సినిమాలు.. మరో వైపున భారీ స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాలు మహేష్ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరో బ్రాండ్ ను తన యాడ్స్ ఖాతాలో వేసుకున్న మహేష్.. సాటి హీరోలకంటే ఎంతో ముందున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ‘బిజినెస్ మెన్’ అనిపించుకుంటున్నాడు.

వరుస సినిమాలతోనే కాదు.. కార్పోరేట్ యాడ్స్ లల్లోనూ దూసుకుపోతున్నాడు మహేష్. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్లలో.. దూసుకుపోతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బ్రాండ్ ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇతర కంపెనీల పోటీని తట్టుకునేందుకు తమ సంస్థకు ప్రచార కర్తగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును నియమించుకుంది దేశీయ ద్విచక్ర వాహనాల సంస్థ టీవీఎస్ మోటార్స్. సౌతిండియా మార్కెట్లో ఆ కంపెనీ అమ్మకాలు పెంచే దిశగా మహేష్ తో ఇక్కడ విస్తృత ప్రచారం చేయించనున్నారు. మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వల్ల తమ అమ్మకాలు పెరుగుతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. ఈ డీల్‌కు గాను మహేష్ బాబుకు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు ఇప్పటికే అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్’, యూనివర్సెల్, నవరత్న హెయిర్ ఆయిల్, ధమ్స్అప్, వివెల్, ఐడియా, జోష్ అలూకాస్, ప్రోవోగ్, అమృతాంజన్, సంతూర్, మహీంద్రా, ‘రాయల్ స్టాగ్’.. వంటి డజన్ కుపైగా బిగ్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. మరి కొన్ని కంపెనీలు ప్రిన్స్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నాయి. మరోవైపు అనేక షాపింగ్ మాల్స్, ప్రైవేటు హస్పిటల్స్ కు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా ఈ రేంజిలో యాడ్స్ ద్వారా సంపాదించడం లేదు. మరో వైపు అటు వరుస సినిమా హిట్లతో మహేష్ బాబు టాప్ రేంజిలో కొనసాగుతున్నాడు.

షూటింగ్ డేస్ బాగా తక్కువ.. ఆదాయం ఎక్కువ.. సినిమాతో పోలిస్తే అందుకే్ మహేష్ ఇలా ఫిక్సవుతున్నాడు. ఈ యాడ్స్ కి మార్కెట్ లో మంచి స్పందన రావటం వల్లే బిగ్ కంపెనీలన్నీ మహేష్ జపం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి మహేష్.. మరే టాలీవుడ్ హీరోకు లేని క్రేజీని సొంతం చేసుకుంటున్నాడు. మొత్తానికి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ మహేష్ ‘బిజినెస్ మెన్’ అనిపించుకుంటున్నాడు.