తెలంగాణ కి మరో భారీ ప్రాజెక్ట్…

Wednesday, October 3rd, 2018, 02:44:44 AM IST

తెలంగాణ ప్రభుత్వ పని తీరు మరియు మౌలిక వసతుల కారణం గా ఈ రాష్ట్రానికి మరో కొత్త ప్రాజెక్టు నిర్మించడానికి ఎస్ఎంటీ కంపెనీ ముందుకొచ్చింది. ఐతే ఈ కంపెనీ బృందం ఇవాళ హైదరాబాద్ లో కేటీర్ ని కలిసి కంపెనీ కి సంబంధించి వివరాలను చర్చించినట్లు తెలిపింది.

ఐతే చర్చానతరం ఈ బృందం తెలిపిన వివరాల మేరకు రూ.250 కోట్లతో సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ లో ఎస్ఎంటీ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐతే ఈ ప్లాంట్లలో గుండె సంబంధిత స్టెంట్ లను తయారుచేస్తాని కంపెనీ అధికారులు తెలిపారు. కాగా, ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెలంగాణకు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మరియు ఈ ప్లాంటు లో కొత్తగా రెండువేల మంది కి దాకా ఉద్యోగాలు లభించునున్నాయని అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.