రూ. 17 వేలకే 40 ఇంచుల మరో Mi టీవీ

Sunday, March 4th, 2018, 03:00:21 AM IST

ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అభివృద్ధి విషయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ చేస్తున్న కంపనీలు రోజు రోజుకూ అత్యంత వేగంగా ముందుకు వెళ్తున్నాయి. చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ ఈ ఏడాది జనవరిలో 50 ఇంచుల 4కె హెచ్‌డీఆర్ టీవీని ఎంఐ టీవీ4 పేరిట విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ టీవీ ధర రూ.39,999 ఉండగా దీనికి గాను నిర్వహిస్తున్న ఫ్లాష్ సేల్స్‌ లోఈ టీవీని పెద్ద సంఖ్యలో యూజర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐ టీవీ4కు వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇదే టీవీ సిరీస్‌లో తక్కువ ధర కలిగిన మరో మోడల్ టీవీని షియోమీ తాజాగా లాంచ్ చేసింది. ‘ఎంఐ టీవీ 4ఏ’ పేరిట విడుదలైన ఈ టీవీ వచ్చే వారం నుంచి వినియోగదారులకు మార్కెట్ లో లభ్యం కానుంది. రూ.17,450 ధరకు ఈ టీవీ వినియోగదారులకు ఆన్ లైన్ మార్కెట్ లో సెల్ కు సిద్దం కానుంది.

షియోమీ విడుదల చేసిన ఎంఐ టీవీ 4ఏలో 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఎంఐయూఐ టీవీ ఓఎస్ (ఆండ్రాయిడ్ ఆధారితం), వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఏవీ, ఈథర్‌నెట్ పోర్టులు, డాల్బీ ఆడియో తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇంత తక్కువ రేట్లకే ఇన్ని రకాల ఫీచర్లు కలిగిన టీవీలను విడుదల చేయడంవల్ల మిగితా కంపనీల సేల్స్ ఒక్కసారిగా భారీగా పడిపోవడం ఆయా కంపనీదారులను కాస్త ఆందోళనపరుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments