ప్రణయ్ హత్య మరువకముందే మరో పరువు హత్య..!

Tuesday, October 9th, 2018, 02:04:39 PM IST

గత కొద్దీ రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడా ప్రాంతంలో ప్రణయ్ అనే వ్యక్తిని దారుణంగా పరువు హత్య చేసిన సంగతి తెలిసినదే.ఆ దారుణ సంఘటన ఎంతటి కాలకలాన్ని రేపిందో కూడా తెలిసినదే.మళ్ళీ ఆ కొద్ది రోజుల్లోనే మనోహరాచారి అనే వ్యక్తి కూడా తమకన్నా తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో తన కన్న కూతురి మీదనే కత్తితో దాడి చేసాడు.ఇప్పుడు ఇదే తరహా లో మరో పరువు హత్య కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లా తాడికల్ ప్రాంతంలో కుమార్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసి గ్రామ శివార్లలో విడిచిపెట్టారు.అక్కడి తాడికల్ దగ్గర ప్రాంతంలోనే ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు.వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లబోతుందన్న సమయంలో వారి పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్దుబాటు చేద్దాం అని చూసారని,అయినా సరే వారు మాట వినకపోవడంతో ఆ అమ్మాయి తరుపున బంధువులే కుమార్ ని చంపేశారని అతని కుటుంబీకులు వాపోతున్నారు.అంతే కాకుండా ఈ హత్యకు ప్రధాన కారణం కులమే అని కుమార్ తరపున వారు వాదిస్తున్నారు.ఇప్పటికే కుమార్ కుటుంబీకులు కరీంనగర్ మరియు వరంగల్ ప్రధాన రహదారిలో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకొని వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.