ఉత్తమ్ కుమార్ కి మరొక సవాల్…

Sunday, May 26th, 2019, 11:00:48 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరోక సవాల్ ఎదురయింది. ఉత్తమ్ కుమార్ నల్లగొండ నుండి ఎంపీగా గెలవడంతో, తాను ఎమ్మెల్యేగా ఎన్నికలైన హుజుర్ నగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సాధారణం కాదు. కానీ కేవలం రాహుల్ గాంధీ చెప్పడం వలన ఉత్తమ్ కుమార్ ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. కానీ తానూ గెలుస్తానని కూడా అసలే అనుకోలేదు. కానీ అనుకోకుండా ప్రజలు కాంగ్రెస్ కి ఓటేసి మరీ ఉత్తమ్ ని గెలిపించారు. దాదాపుగా పదిహేను వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు. కాగా ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు రావడం ఖాయమే. అయితే ఆ స్థానంలో ఉత్తమ్ కుమార్ భార్య కి టికెట్ వచ్చే అవకాశం ఉందని అందరు అనుకుంటున్నారు.

కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ భార్య కోదాడ నుండి పోటీ చేసి అతి తక్కువ తేడాతో ఓడిపోయారు. కాగా ఇపుడు తనకి మరొక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ అక్కడ బలమైన తెరాస నాయకుడు గనక పోటీకి దిగితే ప్రత్యర్ధులు ఎవరు కూడా గెలవలేరని తెలుస్తుంది. అయితే అక్కడ సైదిరెడ్డి అనే ప్రత్యర్థి చేతిలో కేవలం మూడువేల ఓట్ల తేడాతో మాత్రమే ఉత్తమ్ కుమార్ గెలుపొందారు. కాగా ఇప్పుడు అక్కడ సైదిరెడ్డి మళ్ళీ నిల్చుంటే తన గెలుపు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ సందర్భంగా ఉత్తమ్ తన భార్య ని గెలిపించుకోవడం అనేది తనకి ఒక సవాల్ లాగా మారిందని అందరు అంటున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి మరి…