ధోని గ్యారేజీలో మరొక ఖరీదైన బైక్!

Friday, June 1st, 2018, 01:10:47 PM IST

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. హెలికాప్టర్ షాట్ కొట్టడంలో మంచి సిద్ధహస్తుడైన ధోని, అనతి కాలంలోనే లక్షలమంది అభిమానులను సంపాదించాడు. స్వతహాగా బైక్ ల ప్రియుడైన ధోని ప్రస్తుతం తన గ్యారేజిలో వున్న 21 బైక్ లకు తోడు మరొక అద్భుతమైన బైక్ కు చేర్చి మొత్తం 22 బైక్ లకు యజమానిగా నిలిచాడు. ఇక విషయంలోకి వెళితే, ధోని కొనుగోలు చేసిన ఈ బైక్ అలంటి ఇలాంటి సాధారణమైన బైక్ కాదు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తన అసమాన ప్రతిభతో యుద్ధసమయంలో పోరాడిన ఎఫ్6ఎఫ్ హెల్ క్యాట్ ఫైటర్ జెట్ విమానం జ్ఞాపకార్ధం కాన్ఫడరేట్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తాయారుచేసిన ఎక్స్132 హెల్ క్యాట్ బైక్ ఇది. దాదాపు 227 కేజీల బరువుండే ఈ బైక్ ను విమాన తయారీలో ఉపయోగించే టైటానియం, కార్బన్ ఫైబర్ తో తాయారు చేశారట.

మన్నిక పరంగా ఎంతో దృడంగా వుండడమేకాక తేలికగా ఉండడం కూడా ఈ బైక్ ప్రత్యేకత. ఇప్పటివరకు ప్రపంచము మొత్తం మీద కేవలం 150 బైక్ లు మాత్రమే తయారయ్యాయని, తాయారు చేసిన వెంటనే ఇవి మంచి హాట్ కేక్ ల్లా అమ్ముడయ్యాట. ఇకపోతే ప్రముఖ స్టార్లు డేవిడ్ బేక్హాం, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ వంటి వారి వద్ద మాత్రమే ఈ బైక్ ఉందట. కాగా ఈ బైక్ కు ఓనర్ గా ఏకైన ఈశాన్య ఆసియా వ్యక్తిగా ధోని నిలిచారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ బైక్ పై ధోని అమిత ఉత్సాహంతో తన సొంత ఊరు రాంచిలో చెక్కర్లు కొడుతున్నాడట….