జయరాం హత్య కేసు: మరో కీలక మలుపు..!

Saturday, February 9th, 2019, 10:05:44 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త జయరామ్ మర్డర్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానించిన శిఖా చౌదరికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో జయరామ్ భార్య పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఇప్పటి వరకు రెండు సార్లు పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో శిఖా చౌదరికి త్వరలోనే నోటిసులిస్తామని పోలీసులు అన్నారు. అదే విధంగా రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను తమకు అప్పగించాలని పోలీసులు పిటి వారెంట్ ను జారీ చేశారు. ఈ క్రమంలో నిందితులను కోర్ట్ అనుమతితో నాంపల్లి కోర్ట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

మొదటినుండి శిఖా చౌదరి, జయరాంలపై వస్తున్న ఆరోపణలు, ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉదంటూ వస్తున్న ఆరోపణలపై జయరామ్ సతీమణి పద్మశ్రీ తొలిసారి స్పందించారు, తన భర్త ‘ఉమనైజర్’ కాదని, మా మధ్య 30 ఏళ్ల బంధం ఉందని చెప్పుకొచ్చారు. తన భర్త ఎవరు అడిగినా సాయం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తే తప్ప అలాంటోడు కాదని ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని పద్మశ్రీ కొట్టిపారేశారు. తన భర్త హత్యలో కుట్ర ఉందని పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు. అయితే శిఖా చౌదరి మాత్రమే ప్రధాన సూత్రధారి అని, రాకేష్ రెడ్డి పాత్రధారి మాత్రమే అని అన్నారు, సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు జయరాం కంపెనీకి సంబందించిన కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారు.