ఐపీఎల్ బెట్టింగ్ లో సినిమా డైరెక్టర్!

Wednesday, June 6th, 2018, 04:01:39 PM IST


ఐపీఎల్ 2018 విజయవంతంగా ముగిసింది అనగానే బెట్టింగ్ ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఇప్పటికే సల్మాన్ సోదరుడిని అర్బాజ్ ఖాను ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 2 కోట్ల వరకు బెట్టింగ్ లో పోగొట్టుకున్నట్లు శనివారం ముంబై లోని థానే పోలీసుల ఎదుట అర్బాజ్ ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో మరో బాలీవుడ్ దర్శకుడు బెట్టింగ్ కి పాల్పడినట్లు తేలింది.

ముంబై కి చెందిన సోను పలువురు బాలీవుడ్ తారలతో పాటు బిజినెస్ మాగ్నెట్ పేర్లను కూడా తన డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు సీక్రెట్ గా కొంత మందికి సమన్లు అందించారు. ఇకపోతే దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ కూడా ఉన్నట్లు సోనూ జలన్‌ పోలీసులకు వివరించాడు. బాలీవుడ్ లో హే బేబీ – హిమ్మత్‌వాలా – హమ్‌షకల్స్‌ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాజిద్ గత ఏడేళ్లుగా బెట్టింగ్స్ కి పాల్పడుతున్నట్లు తేలింది. దాదాపు ఇతను కూడా రెండు కోట్ల వరకు డబ్బు పోగొట్టుకున్నట్లు విచారణలో తేలింది.

  •  
  •  
  •  
  •  

Comments