జగన్ యాత్రలో పాల్గొన్న మరొక సినీ నటుడు!

Tuesday, May 29th, 2018, 03:17:59 PM IST

వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్న రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన ఆయన ప్రస్తుతం మూడువేల కిలోమీటర్లవైపుకు అడుగులేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే జగన్ చేపట్టిన ఈ దీక్షలో చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా అన్ని వయస్కుల వారు ఆయన తో కలిసి వస్తూ యాత్రను జయప్రదం చేస్తున్నారని వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. అంతే కాదు, యాత్రలో భాగంగా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ఇతరపార్టీల నేతలు తమ పార్టీలోకి రావడం కూడా నేతల్లో, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతోంది. అయితే నేడు ఆయన పాదయాత్ర 175వ రోజుకు చేరుకుంది.

యాత్ర చేపట్టినప్పుడు ఆయన ఎలా వున్నారో, ప్రస్తుతం ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఈ మండుటెండల్లో కూడా మొక్కవోని ఉత్సాహంతో ముందుకెళుతున్నారని ఇటీవల ఆయనను యాత్రలో కలిసిన నటుడు, దర్శకుడు అయిన పోసానికృష్ణ చెప్పకనే చెప్పారు. కాగా నేడు ఆయన యాత్రలో మరొక నటుడు జగన్ తో కలిసి అడుగులో అడుగు కలిపారు. ఆయన మరెవరో కాదు కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్. ఆయన యాత్ర వీరవాసంలోకి చేరుకోగానే పృథ్వి అనూహ్యంగా యాత్రలో జగన్ కలిసి అభివందనం చేసి, ఆయనతో కలిసి, వైసిపి జెండా మోస్తూ దాదాపు రెండు కిలోమీటర్లు నడిచారు. కాగా ఇదివరకు కూడా పృథ్విరాజ్ వైసిపి తరపున ప్రచారం చేసిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ నుండి సీట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది…..