“బిగ్ బాస్ 3” మరింత ఎంటర్టైన్మెంట్ పక్కా..మరో ఆసక్తికర కంటెస్టెంట్.?

Friday, May 17th, 2019, 01:10:49 PM IST

ఈసారి తెలుగునాట ఫేమస్ రియాల్టీ గేమ్ షో “బిగ్ బాస్ సీజన్ 3” మాత్రం ముందు రెండు సీజన్ల కన్నా మరింత ఆసక్తికరంగా మరియు అంతకు మించిన ఎంటర్టైనింగ్ గా ఉండడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు.జులై నెలలో మొదలు కాబోతున్న ఈ షోకు హోస్ట్ ఎవరు అన్నది ఖరారు కాకపోయినా అప్పుడే ఆ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఒక్కొక్కరిగా బయటకు వస్తుంది.నిన్ననే “పటాస్” నుంచి బ్రేక్ తీసుకున్న శ్రీముఖి ఈ మూడో సీజన్లో కనిపించనున్నారని తెలిసింది.

శ్రీముఖి ఉంటే ఆ ఎంటెర్టైన్మెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ను మరింత ఎక్కువ చేసే మరో వ్యక్తి పేరు ఇప్పుడు వినిపిస్తుంది.”వైవా” అనే ఒక షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న “వైవా హర్ష” కూడా ఈ సీజన్లో కనిపించనున్నట్టు సమాచారం.ఇప్పటికే ఈ ఇద్దరు ఈ షోకి దాదాపు ఖరారు అని తెలుస్తుంది.ఇంకా ఆసక్తికర ఆటగాళ్లు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే ముందు సీజన్ల కన్నా మరింత వినోదాన్ని అందించడం పక్కా అని చెప్పాలి.