వైసీపీకి మరో షాక్..జగన్ వైఖరి నచ్చకే “జనసేన” పార్టీలో చేరబోతున్నా..మాజీ ఎమ్మెల్యే!

Friday, October 19th, 2018, 06:57:50 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ జనసేన రోజురోజుకు మరింత బలపడుతుందనే చెప్పాలి.ఇప్పటికే చాలా మంది సామాన్యులు,టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు మరియు వై ఎస్ జగన్ యొక్క పార్టీ వైసీపీ నుంచి చాలా మంది నేతలు మరియు మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ రోజే విశాఖ జిల్లాకి చెందినటువంటి టీడీపీ ముఖ్య నేత సుందరపు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.మళ్ళీ ఈ రోజునే వైసీపీ పార్టీకి చెందినటువంటి మరో ముఖ్య నేత వైసీపీ ని వీడి జనసేన పార్టీలో త్వరలోనే చేరబోతున్నాను అంటూ వైసీపీ శ్రేణులకు గట్టి షాక్ ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు అక్కడి ప్రాంత వైఎస్సార్ పార్టీ యొక్క కో ఆర్డినేటర్ అల్లూరి కృష్ణం రాజు తన అనుచరులతో సహా తమ ప్రస్తుత పార్టీ వైసీపీ కి రాజీనామా చేస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు.ఇందుకు కారణం వై ఎస్ జగన్ యొక్క వైఖరి తమకి నచ్చకే స్వచ్చందంగానే తాము పార్టీని వీడనున్నాం అన్నట్టు వారు తెలిపారు.అయితే వారు జనసేన పార్టీలో చేరబోతున్నామని ఈ విషయం పై పవన్ తో చర్చలు జరిపి అతి త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నామని వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments