ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం..జగన్ పై మరో భారీ కుట్ర జరుగనుందా..?

Tuesday, June 4th, 2019, 09:47:33 AM IST

దాదాపు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసారు.వై ఎస్ మరణాంతరం తనపై ఒక్క కేసు కూడా లేదని తన తండ్రి చనిపోయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల వారు దారుణమైన కుట్రలు పన్ని తనపై అనేక కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారని జగన్ అన్నారు.ఇది మాత్రం వైసీపీ శ్రేణులకు అస్సలు మింగుడు పడని విషయం అని చెప్పాలి.ఈ విషయం పైనే వారు ఎన్నో రకాల విమర్శలు ఇతర పార్టీల నుంచి ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు.

ఇప్పుడు మళ్ళీ జగన్ పై అదే తరహా కుట్ర జరుగనుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో రేకెత్తుతున్నాయి.అది కూడా మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీయే జగన్ పై కుట్ర చేసే సూచనలు ఉన్నాయని ఒక వార్త రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.అయితే ఇది మాత్రం ముందులా కేసులు బనాయించి జైలుకు పంపే విధమైన స్కెచ్ కాదని ఇది వేరే ఏదో విషయం అని మరికొంత మంది అంటున్నారు.మరి మొత్తానికి బీజేపీ జగన్ పై ఎలాంటి స్కెచ్ వేసిందో లేక ఒట్టి విష ప్రచారమా అన్నది రానున్న రోజుల్లో తెలియాలి.