చంద్రగ్రహణం.. చూడొచ్చా.. లేదా?

Thursday, July 26th, 2018, 12:14:47 PM IST

శుక్రవారం ప్రపంచానికి అరుదైన చంద్రుడు దర్శనమిస్తాడు. ఎరుపు రంగులోకి మారిపోయే చంద్రుడు ఎలా ఉంటాడా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రుడిని డైరెక్ట్ గా చుస్తే కంటిచూపు పోయే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. మరికొందరైతే ఈ ఇది పెద్ద అరిష్టమని చెబుతుండడడం వైరల్ అవుతోంది. కొన్ని ప్రత్యేకమైన అద్దాలతో ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూసి ఆస్వాదించవచ్చని ఎక్కువ మంది చెబుతున్నారు. దీనిపై ఇంతకుముందే శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు. ఈ చంద్రగ్రహణాన్ని ఎలాంటి అద్దాలు లేకుండా చూడవచ్చని చెబుతున్నారు. సాధారణంగా చంద్రగ్రహణం రెండు దశలుగా ఉంటాయని మొదటి దశలో కొంతభాగం చంద్రుడిపై నీడ వస్తుంది. అనంతరం చంద్రుడు భూమి నీడలో పూర్తిగా రావడంతో అప్పుడు సంపూర్ణం చంద్రగ్రహణం ఉంటుందని చెబుతున్నారు. 1.43 గంటల వరకు కొనసాగే ఈ గ్రహణం చాలా అరుదైన విషయమని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మరి ఈ బ్లడ్ మూన్ ఎలా ఉంటుందో?