చంద్రబాబు కి మరో బహిరంగ లేఖ…

Thursday, November 8th, 2018, 03:20:48 PM IST

ఇప్పటికి కూడా మన తెలంగాణకు చంద్ర బాబు ద్రోహం చేస్తున్నారని, ఇకనైనా మారి సరిగా ఉండమని మన తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు 18 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను రాశారు. చంద్రబాబు తన పార్టీ ని, రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణకి ఇప్పటికి కూడా ద్రోహం చేతున్నారని, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేల కుట్ర చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబుకు అసలు నచ్చదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణలో తెరాస ని ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు వ్యతిరేకత ఉందని హరీశ్ రావు మంది పడ్డారు. చంద్రబాబును చూసి రంగులు మార్చే ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. తెలంగాణలో టీడీపీ పూనుకున్నటువంటి మహా కూటమి పోటీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. బాబు చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని మళ్లి తెలంగాణలో పోటీ చేస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబు చాల సార్లు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర చేసారని ఆరోపించారు. చంద్రబాబు కి వ్యతిరేకంగా ఏర్పడిన తెలంగాణకి అసలే మద్దతు ఇవ్వలేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్‌ ఇవ్వకుండా బాబు ఇబ్బందిపెట్టారన్నారు. తెరాస అధికారం లోకి వచ్చాక కేసీఆర్‌ వెలుగు విరజిల్లే తెలంగాణను రూపొందించారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ ద్రోహి అని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, అమరావతికి వెళ్లిపోయిన చంద్రబాబును తిరిగి తెలంగాణా కి తేవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, తెలంగాణా తల్లి విగ్రహానికి చంద్రబాబు ఏనాడైనా దండ వేశారా అని తీవ్రంగా మంది పడ్డారు. ఎవరు కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని, చంద్రబాబు ద్రోహాలపై ఊరూరా ప్రచారం చేయాలన్నారు. తిరిగి తెలంగాణ లో తెరాస ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని హరీష్ రావు పిలుపునిచ్చారు.