బయటపడుతున్న జగన్ నిజస్వరూపం..ఎమ్మెల్యే టిక్కెట్టుకి 50కోట్లు..?

Sunday, September 23rd, 2018, 09:29:57 AM IST

బయటకి ఏదో నవ్వుతూ, ముద్దులు పెడుతూ ప్రేమను నటిస్తాడని అదంతా నటనే అని కానీ లోపల అంతా కుళ్ళు కుతంత్రంతో ఉంటాడు అని జనసేన పార్టీలో చేరి మొట్ట మొదటి అభ్యర్థిగా ఎంపికైన పితాని బాలకృష్ణ గారు వై ఎస్ జగన్ కోసం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాకుండా జగన్ పచ్చి మోసగాడు అని కూడా చాలా ఆవేదనతో అతను చేసిన మోసాన్ని చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు.కానీ ఇప్పుడున్న పరిస్థులను చూస్తుంటే వై ఎస్ జగన్ నిజంగా అలాంటి వారేనేమో అని అనిపించక మానదు.

జగన్ యొక్క అసలు స్వరూపం ఎలాంటిదో మెల్ల మెల్లగా ప్రజలలోకి వెళ్ళడానికి కొన్ని అనుచిత సంఘటనలు ఆయన వల్ల మోసపోయిన వారు తెలియజేయడం వల్ల వెల్లడవుతుంది.దీనికి కారణం నెల్లూరు జిల్లాలోని బొమ్మి రెడ్డి నాగి రెడ్డి అనే వ్యక్తిని ముందు వెంకటగిరి ఇంచార్జిగా మీరు పోటీ చెయ్యాలని చెప్పి వై ఎస్ జగనే తనని పార్టీలోకి పిలిచి,ఎమ్మెల్యేగా టిక్కెట్టు ఇస్తానని మాట ఇచ్చి ఆశ చూపి పార్టీలోకి ఆహ్వానించారని,కానీ ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి ఆ టిక్కెట్టుని ఆనం నారాయణ రెడ్డికి ఇచ్చేశారని వాపోతున్నారు.

ఇదేంటి ఇలా చేశారు అని బొమ్మిరెడ్డి అడగగా ఆనం నారాయణ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం 50 కోట్లు ఖర్చు చెయ్యగలడు నువ్వు ఖర్చు చేయగలవా? అని జగన్ ప్రశ్నించారని బొమ్మిరెడ్డి వాపోయారు.దీనితో గౌరవం లేని పార్టీ లో తాను ఉండలేనని అని తెలిపారు,ముందు తనకి మాట ఇచ్చి ఆ తర్వాత కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నారాయణ రెడ్డికి టిక్కెట్టు ఎలా ఇస్తారని వాపోయారు.దీన్ని బట్టి చూస్తుంటే మొన్న పితాని బాలకృష్ణ గారు జగన్ వైఖరి కోసం చెప్పిన మాటలు కూడా వాస్తవమే అనిపిస్తుంది.ఓటర్లు తస్మాత్ జాగ్రత్త సరైన నాయకుడిని ఎన్నుకోవడం మీ చేతుల్లోనే ఉంది..