“టీడీపీ”కి మరో గట్టి షాక్ టీడీపీ ముఖ్య నేత “జనసేన” లోకి జంప్.!

Friday, October 19th, 2018, 01:00:04 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవన్ యొక్క జనసేన పార్టీ ఈ సారి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటమిలను పక్కన పెడితే ఈ సారి మాత్రం ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందనే చెప్పాలి.ఇప్పటికే ఈ పార్టీలోకి ఈ మధ్యన భారీ ఎత్తున వలసలు వెళ్తున్నారు.పలు ప్రాంతాల్లో టీడీపీ,వైసీపీ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలు ముఖ్య నేతలు వారి పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరిన సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి.

ఇప్పుడు మళ్ళీ తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ ఎదురయ్యింది.విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంకి చెందినటువంటి సుందరపు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహిస్తారు.అయితే ఇప్పుడు తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా తెలిపి అక్కడి టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చారు.తాను జనసేన పార్టీలోకి ఎందుకు చేరారో కూడా వివరణ ఇచ్చారు.ఇప్పుడున్న మిగతా పార్టీలలా జనసేన పార్టీ లోపల ఒకటి బయట ఒకటి చెప్పే పార్టీ కాదని ఏది చెప్తే అదే చేసే పార్టీ అని తాను కూడా అలాంటి స్వభావం ఉన్న వ్యక్తినే కాబట్టి స్వతహాగానే జనసేన పార్టీలో చేరుతున్నానని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు యొక్క స్పందన ఎలా ఉంటుందో మరి.

  •  
  •  
  •  
  •  

Comments