బిగ్ బ్రేకింగ్ : ఫలితాల తర్వాత సంచలనం రేపుతున్న సోషల్ మీడియా సర్వే..!?

Sunday, May 26th, 2019, 10:29:03 AM IST

ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి.ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడ్డ పడిగాపులుకు వారు ఇచ్చిన ప్రజా తీర్పు మొన్న 23 వ తారీఖుతో బయట పడింది.కానీ ఈ ప్రజా తీర్పు వెనుక ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఇది నిజమైన ప్రజా తీర్పేనా లేక ఏమన్నా జరిగిందా అన్న అనుమానం చాలా మంది మదిలోనే మెదిలింది.ఇది వాస్తవం అనే చెప్పాలి.రాజ్యాధికారాన్ని చేపట్టిన జగన్ 150 స్థానాల్లో గెలుపొందుతారని సామాన్య ఓటర్ కూడా కలలో కూడా ఊహించి ఉండరు.

అయితే అసలు ఈ ఎన్నికలు ఎలా జరిగాయి ఫలితాలు ముందే డిసైడ్ చెయ్యబడ్డాయా అనే అనేక రకాల అనుమానాలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి.ఎన్నికలకు ముందు అనేక రకాల సర్వేలు ఏపీలో రాబోయే ఫలితాలను గురించి ఒక అంచనా వేసాయి.కానీ ఇప్పుడు ఫలితాల అనంతరం సోషల్ మీడియా సర్వే అంటూ అప్పుడు ఎన్నికల ఫలితం అనంతరం ఓ వైసీపీ అభిమాని పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు కలకలం రేపుతోంది.ఆ పోస్టులో సోషల్ మీడియా సర్వే రిపోర్టు ప్రకారం వైసీపీకు 151 స్థానాలు తెలుగుదేశం పార్టీకు 24 స్థానాలు వస్తాయని ఇదే ప్రజాతీర్పు కావాలని ఉంది.

ఇప్పుడు ఎన్నికల ఫలితాలు తర్వాత చూసుకున్నట్టయితే అచ్చు ఒక్క సీటు తేడాతో ఇరు పార్టీలకు స్థానాలు వచ్చాయి.అంటే వైసీపీకి ఇన్ని స్థానాలు పక్కాగా వస్తాయని కొంతమంది వైసీపీ అభిమానులకు ముందే తెలుసా..?దాని ఆధారంగా ఎన్నికలు వారి కను సన్నల్లోనే జరిగిందా అనే అనేక రకాల అనుమానాలు ఇప్పుడు కొంతమంది ఇతర పార్టీల వారికి కలుగుతున్నాయి.మరి దీనంతటి వెనుక ఏ మతలబు ఉందో రానున్న రోజుల్లో తెలుస్తుందో లేక మిస్టరీ గానే మిగిలిపోతుందో చూడాలి.