ఈ సర్వేలో కూడ జగనే సిఎం !

Friday, October 5th, 2018, 10:06:46 AM IST

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పలు మీడియా సంస్థలు ఎన్నికల ఫలితాలపై సర్వేలు నిర్వహించడం ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఇండియా టుడే ఒక సర్వే చేసి ఆంధ్రాలో వైఎస్ జగన్ దే పై చేయి అని లెక్కలు చూపగా తాజాగా రిపబ్లిక్ టీవీ చేపట్టిన సి ఓటర్ సర్వే కూడ జగన్ ముఖ్యమంత్రి అవుతారని, చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోతారని చెబుతోంది.

సి ఓటర్ సంస్థ లెక్కల ప్రకారం రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కేవలం 4 పార్లమెంట్ సీట్లు దక్కుతాయని, వైసీపీకి 21 సీట్లు వస్తాయని, ఓట్ల శాతంలో వైసీపీ అత్యధికంగా 41.9 % దక్కించుకుంటుందని, టీడీపీ 31.4 %, బీజేపీ 12.5 %, కాంగ్రెస్ 12.5 %, జనసేన, సీపీఐ, సీపీఎం, ఇతరులు కలిసి 8 నుండి 9 % సాధిస్తారని పేర్కొంది.

ఇలా రెండు పెద్ద సంస్థలు చేపట్టిన సర్వేల్లో ఓటమి తప్పదని తేలడం చంద్రబాబును కంగారులో పడేస్తుండగా పొత్తులు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ఫలితాన్ని అందుకొంటారనే వార్త వైకాపా నేతలకు ఉత్సాహాన్నిస్తోంది. మరి ఈ సర్వేలు ఎంత వరకు సత్యమవుతాయో చూడాలి.