మరొక టీడీపీ నేత, వైసిపి లోకి!

Monday, July 30th, 2018, 07:41:55 PM IST

ఇప్పటికే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులూ జంప్ జిలానీలుగా మారుతున్నారు. ప్రస్తుతం వున్న పార్టీలనుండి తమ అనుకూల పార్టీల్లోకి దూకుతున్నారు. అయితే ముఖ్యంగా ప్రధాన పార్టీల్లోని నేతలు తమకు ఎక్కడైతే పక్కాగా సీట్లు దక్కుతాయో ఆ పార్టీల బాట పడుతున్నారు. ఇక విషయంలోకి వెళితే, పిఠాపురం ప్రాంతంలో టీడీపీ తరపున ఎంపిపి, జెడ్పిటిసి గా సేవలందించిన బుర్రా శ్రీ ఆంజనేయ కామరాజు తనయుడు చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త అయిన బుర్రా అనుబాబు కొన్నాళ్ల నుండి టీడీపీలో ఉండి, ఆ పార్టీలో తనకు సముచిత స్థానం లభించకపోవడంతో ఆయన నేడు పిఠాపురం మండలం విరవ వద్ద ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్న వైసిపి అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

ఈ మేరకు ఆయన నిన్న పిఠాపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్దగల ఫంక్షన్ హాలులో వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటన చేసారు. వైసిపిలో చేరదలుచుకున్నట్లు జగన్ తో కలిసి మాట్లాడితే, ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారని, అయితే పార్టీ సర్వే ప్రకారమే టికెట్ ఇవ్వడం జరుగుతుందని జగన్ ముందే చెప్పారని, ఈ ప్రాంతంలో టికెట్ ఎవరికి దక్కినా కూడా తాను వారి తరపున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రచారం చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. ఇక నేడు పార్టీలో చేరిన ఆయన, జగన్ చేపట్టిన ఈ యాత్ర వియజయవంతమైందని, ఇప్పటికే ప్రజలందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడవాలని చూస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా ఆయనను జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు….

  •  
  •  
  •  
  •  

Comments