డెడ్‌లైన్ ప్ర‌క‌టించిన జ‌గ‌న్.. ప‌రిగెత్తుతున్న టీడీపీ ఎమ్మెల్యే..!

Tuesday, February 19th, 2019, 12:10:15 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు నోటిఫికేష‌న్ విడుద‌ల టైమ్ స‌మీపిస్తున్న త‌రుణంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైసీపీలోకి రావాల‌నుకుంటున్న నేత‌ల‌కు డెడ్‌లైన్ ప్ర‌క‌టించారు. దీంతో వైసీపీ వైపు చూస్తున్న ఇత‌ర పార్టీ నేత‌లు అన్ని ప‌నులు ఆపేసి జ‌గ‌న్ వ‌ద్ద‌కు ప‌రిగెత్తుతున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే అధికార తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గీసిన గీత‌ను చెరిపేస్తూ.. పార్టీకి రాజీనామా చేసి మ‌రీ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే టీడీపీకి చెందిన మ‌రో ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేర‌నున్నార‌నే వార్త అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం అవుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మోదుగుల, వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సరావుపేట పార్ల‌మెంట్ నుండి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.

ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబుకు తెల్ప‌గా ఆయ‌న నుండి ఎటువంటి హామీ రావ‌డంలేద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా త‌న సామాజిక వ‌ర్గానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న చంద్ర‌బాబు పై తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవ‌ల ప్ర‌త్య‌క‌హోదా విష‌యంలో కేంద్రం పై నిర‌స‌న‌గా చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంతా న‌ల్ల చొక్కాలు వేసుకుని నిర‌స‌న తెల్ప‌గా మోదుగుత వేణుగోపాల్ మాత్రం సాధార‌ణ చొక్కాతోనే అసెంబ్లీకి వ‌చ్చారు.

అంతే కాకుండా టీడీపీలో జ‌రుగుతున్న అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల కార‌ణంగా మోదుగుల ఇప్ప‌టికే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. వ‌ల‌స‌ల‌కు జ‌గ‌న్ ఇప్ప‌టికే డెడ్‌లైన్ ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో, వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ మోదుగుల బావ అయోధ్య‌రామిరెడ్డి ద్వారా ఈ టీడీపీ నేత రెండు రోజుల్లో జ‌న‌గ్‌ను క‌లువ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి మోదుగుల కోరిన టిక్కెట్ జ‌గ‌న్ ఇస్తారో లేదో తెలియ‌దు కానీ ఆయ‌న వైసీపీలో చేర‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.