అమ్మ మరణం వెనుక అసలు రహస్యం తెలుస్తుందా?

Monday, October 30th, 2017, 05:58:53 PM IST

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై గత కొంత కాలంగా తమిళనాడులో అనేక ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ వర్గ్లాల నుండి అలాగే సినీ తరాల వరకు ప్రతి ఒక్కరు జయ లలిత మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆమె పక్కన ఉన్న వారే ఆమెను చంపేశారని కూడా మరి కొందరు తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

మొన్నటి వరకు సైలెంట్ గానే ఉన్న తమిళనాడు ఇప్పుడు విచారణ మొదలైందని తెలియడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా సీఎం పళనిసామి సడన్ గా విచారణ కమిషన్ కు ఆదేశించారు. దీంతో కేసులో కీలక సాక్ష్యాలను సేకరించడానికి రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి రంగంలోకి దిగారు. ముందుగా జయలలిత నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న వారిని విచారణ చేసి వివరాలు సేకరించాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ విచారణ ఎన్ని రోజులు జరుగుతుంది? ఎలా సాగుతుంది ? అనే విషయాలు విచారణ పూర్తైన తర్వాత తేలుస్తాయని అన్న డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments