షమీ కెరీర్ పై దెబ్బ పడినట్టే.. ఐపీఎల్ లో ఉండడు?

Saturday, March 10th, 2018, 10:00:26 AM IST

ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పై రీసెంట్ గా భార్య హాసిన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశమంతటా ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2013 లో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిద్దరు గత కొంత కాలం క్రితం విభేదాలతో విడిపోయారు. అయితే హసిన్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతే కాకుండా ఇప్పుడు పోలీస్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. గృహ హింస మరియు పలు సెక్షన్ల కింద జాధవ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో షమీ పై అలాగే అతని కుటుంబ సబ్యలపై కేసు నమోదైంది.

ఈ విషయాన్ని కోల్‌కతా సంయుక్త పోలీసు అధికారి ప్రవీణ్‌ త్రిపాఠి తెలియజేశారు. ముఖ్యంగా షమి సోదరుడు తనపై అత్యాచారం చేశాడని హసీన్‌ కేసు నమోదు చేసింది. అయితే షమీ మాత్రం అవన్నీ అబద్దాలే అని చెబుతున్నాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపాడు. కానీ నేరం రుజువైతే షమీకి పదేళ్ల వరకు శిక్ష పడవచ్చని తెలుస్తోంది. అలాగే అతని కెరీర్ పై కూడా దెబ్బ పడే అవకాశం ఉంది. షమీ తనవైపు నుంచి ఎలాంటి తప్పు లేదని నీరుపించుకుంటేనే మంచిది లేకుంటే ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం చెబుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments