వెలుగులోకి వచ్చిన మరో ఉద్దానం..పట్టించుకోని ప్రభుత్వం.!

Friday, September 21st, 2018, 03:48:19 PM IST

ఇది వరకు ఉద్దానం అనే గ్రామం ఒకటి ఉండేది అని అక్కడ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టేంత వరకు ఎవరికీ తెలీదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం అనే కుగ్రామంలో ప్రజలు అక్కడి పరిసర ప్రాంతాలు తీవ్రమైన కలుషితం కావడం మూలంగా ఎందుకు ఎలా చనిపోతున్నామో కూడా తెలీకుండా చనిపోయే వారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సమస్య మీద ప్రశ్నించినపుడు ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యి తగిన సహకారాలని అందించారు.అయితే ఇప్పుడు మళ్ళీ విశాఖ జిల్లాలో మరో ఉద్దానం లాంటి పల్లెటూరు వెలుగులోకి వచ్చింది.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం మొండిపాలెం అనే గ్రామం ఇప్పుడు మరో ఉద్దానంగా మారిపోతుంది. ఇప్పటికే చాలా మంది గ్రామస్తులు కిడ్నీలు పాడయ్యి మృత్యు వాత పడుతున్నారు.ఆ గ్రామంలో పరిస్థితి ఇలా ఉంది అని అక్కడి ప్రభుత్వ అధికారులకు చెప్పినా వారిని పట్టించుకునే నాధుడే లేదు.ఇంకా ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న వారు దాదాపు 250 మంది దాటి ఉంటారని,అసలు ఆ గ్రామస్థులను ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు అని అక్కడి ప్రజలు వాపోతున్నారు.దీని అంతటికి కారణం ఆ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి క్వారీ నుంచి వెలువడే దట్టమైన ధూళి వ్యర్ధాల వళ్ళ నీరు కలుషితం అయ్యిపోవడం వలెనే ఆ ప్రాంత ప్రజలు చనిపోతున్నారు అని తెలిపారు.ఈ సమస్యను మొగ్గ దశలో ఉన్నపుడే త్వరగా ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారి ప్రాణాలను కాపాడాలి.లేకపోతే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలతో ఒక మచ్ఛు తునకగా మిగిలిపోతుంది.