కాంగ్రెస్ లో రగులుతున్న చిచ్చు.. అంజన్ వర్సెస్ అజారుద్దీన్!

Monday, July 16th, 2018, 05:48:27 PM IST

కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే అంతర్యుద్ధాలు చాలా నెలకొన్నాయని అనేక రకాల కామెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అధిష్టానం నుంచి రాహుల్ కూడా ఎప్పటికప్పుడు నేతలతో చర్చలు జరుపుతూ గొడవలు జరగకుండా చూసుకుంటున్నాడు. అయినా కూడా పార్టీలో సమైక్యత లేదని మరోసారి రుజువయ్యింది. ఒక్కసారిగా నేతల మధ్య ‘గ్రేటర్‌’ చిచ్చు రాజుకుంది. అందుకు మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ కారణమయ్యారు.

ఇటీవల సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు అజహరుద్దీ చేసిన ప్రకటన కు వ్యతిరేకంగా మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీ కోసం తాను పోటీ చేయనున్నట్లు సోమవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకుల సమావేశంలో తెలిపారు. అజారుద్దీన్ కి దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ అంజన్ మాట్లాడుతుండగా సీనియర్ నేత హనుమంతరావు సభ నుంచి సడన్ గా లేచివెళ్లిపోయారు. అనంతరం పలువురు కార్యకర్తలు అజారుద్దీన్ కి వ్యక్తిరేకంగా అంజాన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సభలో కార్యకర్తలను అదుపు చేయాలనీ చూసినప్పటికీ వారు పట్టించుకోకపోవడం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments