వైసిపి మరొక వికెట్ అవుట్…..టీడీపీలోకి కీలక నేత!

Thursday, April 26th, 2018, 04:13:06 PM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలయినట్లు కనిపిస్తోంది. తాము సీటు ఆశిస్తున్న పార్టీలోకి ఆశావహులు వెళుతున్నారు. కాగా ఇప్పటికే వైసిపి నుండి టిడిపికి, అలానే టిడిపి నుండి వైసిపి కొందరు నేతలు జంప్ చేస్తున్నారు. ఓవైపు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి, చంద్రబాబు హోదా కోసం దీక్షలు చేస్తుంటే మరోవైపు వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

ఇరుపార్టీల నేతలు ఈ సారి అధికారం చేజిక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా నేడు వైసిపి పార్టీ వికెట్ ఒకటి పడింది. విజయనగం జిల్లాలో కీలకనేతగా వ్యవహరించిన శత్రుచర్ల చంద్రశేఖర రాజు నేడు టిడిపిలో చేరారు. గత కొద్దికాలంగా అక్కడ కీలకనేతగా వున్న మాజీ ఎమ్యెల్యే చంద్రశేఖర రాజు టిడిపిలో చేరికతో వైసిపికి పెద్ద దెబ్బె తగిలిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేడు టిడిపి మంత్రి నారా లోకేష్ పర్యటనలో భాగంగా ఆయనకు కండువాకప్పి లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా ఆ కార్యక్రమంలో జిల్లాకు చెందిన నేతలు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం కల వ్యక్తులలో చంద్రశేఖర రాజు ఒకరు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసిపి పార్టీ పెట్టిన కొత్తలో విజయనగరం తరపున ఆయనకు మద్దతు ఇచ్చి ముందుకువచ్చిన వారిలో చంద్రశేఖర రాజు ప్రధములు.ప్రస్తుతం ఆయన వెళ్లిపోవడంతో ఆ స్థానం ఎవరికి కేటాయించాలి అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి …..

  •  
  •  
  •  
  •  

Comments