జనసేనాని దెబ్బకి దిగొచ్చిన ఆంధ్ర ప్రభుత్వం..!

Saturday, September 8th, 2018, 11:25:48 AM IST

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత కొద్దీ నెలలుగా ప్రజా పోరాట యాత్ర పేరిట బస్సు యాత్ర చేస్తున్న సంగతి మనకి తెలిసినదే. అయితే ఈ యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజక వర్గం తుమ్మపాల కి చెందిన షుగర్ ఫ్యాక్టరీ అక్రమకంగా మూసివేత కోసం ప్రభుత్వానికి 6 వారాలు గడువు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.తాజాగ అందిన వార్త ప్రకారం జనసేనాని దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చినట్టు తెలుస్తుంది.

ఇక వివరాల్లోకి వెళ్లినట్టయితే జులై నెలలో జరిగిన పోరాట యాత్రలో అనకాపల్లికి చెందిన తుమ్మపాల లోని అద్భుతంగా రాణిస్తున్న చక్కెర కర్మాగారం పై ప్రభుత్వం కన్ను పడిందని 300 కోట్లు విలువ చేసే ఆ కర్మాగారాన్ని కేవలం 10 కోట్లకి సొంతం చేసుకోవాలని చూస్తున్నారని, ఆ కర్మాగారం మీద ఆధార పడి ఎన్నో కుటుంబాలు జీవిస్తుంటే అన్యాయంగా ఆ కర్మాగారాన్ని మూసివేశారని అక్కడి శ్రామికులు జనసేనానికి చెప్పి ఆ కర్మాగారం తెరవకపోతే నిరసనగా దీక్ష చేస్తామని వాపోయారు.

దీనితో వారి సమస్య ను చూసి అక్కడికక్కడే పవన్ కళ్యాణ్ గారు కార్మిక సంక్షేమ నిధికి 2 లక్షల రూపాయలు అందజేశారు. అంతే కాకుండా ఈ సమస్యకి పరిస్కార దిశగా ప్రభుత్వానికి 6 వారాల గడువు ఇద్దాం అని అప్పటికి వారు స్పందించకపోతే మీ దీక్షకు అండగా నేను ఉంటాను అని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సమస్యపై హుటాహుటిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తుమ్మపాల చక్కెర కర్మాగారంకి 30 కోట్లు విడుదల చేసినట్టు ఆంధ్ర ప్రభుత్వం తెలియజేసింది.

  •  
  •  
  •  
  •  

Comments