వాట్సాప్ పుకార్లకు మరొక మహిళ బలి…!

Monday, July 23rd, 2018, 03:07:48 PM IST

అందరికి సెల్ ఫోన్ అందుబాటులోకి రావడం, సెల్ వినియోగం ఎక్కువ కావడం, ఎవరిని చూసినా అత్యధికంగా సోషల్ మీడియా వినియోగించడం వంటి వాటి వల్ల మనలో చాలా మందికి ఉపయోగం ఉన్నప్పటికీ, కొన్ని నష్టాలూ కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, ట్విట్టర్, పేస్ బుక్ వంటి సామజిక మాధ్యమాల వినియోగంతో కొందరు అసత్యాలను ప్రచారం చేసి లేనిపోని వివాదాలను రేపుతున్నారు. మరికొందరు అయితే అవి ఎంతవరకు నిజమో కూడా తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు. కొన్నాళ్ల నుండి ప్రముఖుల్లో ఫలానా వారు మరణించారనే వార్తలు కూడా పుకార్లు రేపాయి. ఆ తరువాత వారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భాలు జరిగాయి. ఇక కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన బీదర్ లో కొందరు చిన్నపిల్లలకు చాకోలెట్లు ఇచ్చి వారిని ఎత్తుకెళ్లిపోతున్నారనే వదంతులు వాట్సాప్లో వ్యాప్తి కావడం సంచలనం రేపింది.

అదే సమయంలో ఆ చుట్టుప్రక్కల స్థలాలాను కొనుగోలు చేయడానికి వచ్చిన ఇతర ప్రాంత వాసులు, ఆ స్థలాలు పరిశీలిస్తూ, అక్కడ ఆడుకుంటున్న పిల్లలకు చాకోలెట్లు ఇవ్వగా వారే పిల్లలను అపహరించుకుపోయేవారని భావించి, వాళ్ళు వచ్చిన కారును ద్వాంసం చేసి, వాళ్ళను తీవ్ర గాయాలపాలు చేసారు బీదరు వాసులు. అందులో ఒక వ్యక్తి తరువాత మరణించాడు కూడా. ఇక ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని సింగ్రాలి జిల్లా మారుమూల ప్రాంతంలో ఒక మహిళ మృత దేహం కనపడిందని, అక్కడి స్థానికులు వాట్సాప్ లో వచ్చిన పుకార్లను నమ్మి, ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఆ మహిళ పిల్లలను అపహరించుకుపోయేదిగా భావించి స్థానికులు ఆమెను రాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. అయితే ఈ హత్య విషయమై అన్ని అధారాలు సేకరించిన పోలీస్ లు గ్రామంలోని కొందరే ఆమెను దారుణంగా చంపారని,

అనుమానం వున్న ఒక 12 మందిని అరెస్ట్ చేశామని, పాపం ఆ మహిళ ఎవరో, ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోకుండా అలా అమానుషంగా కొట్టి చంపడం నేరమని పోలీస్ లు అంటున్నారు. ఈ ఘటనలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వదిలేది లేదని, ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కావున ఇకనైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్న వార్తలను ప్రతి ఒక్కరు ఒకటికి రెండుసార్లు అది నిజమా కాదా అని నిర్ధారించునుకుని ముందడుగు వేయాలని, లేకపోతే ఇలానే అభాగ్యులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని నిపుణులు, మరియు పోలీసులు అభిప్రాయపడుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments