జగన్ వైఖరి వల్ల వైసీపీకి షాకివ్వనున్న మరో ఎమ్మెల్యే..?

Thursday, March 14th, 2019, 04:28:19 PM IST

ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులకు తన పార్టీలో టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్న ఆశావహులు చాలా మందే చెప్పుకొచ్చారు.జగన్ ఒక్కో సీటుకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగే వారు ఎవరైనా వస్తే అప్పటి వరకు పార్టీనే నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలను కూడా పక్కకు వెనుకాడడని చాలా ఆరోపణలే వచ్చాయి.

ఇప్పుడు ఇదే జగన్ వైఖరి వలన ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన జంకె వెంకట రెడ్డి ఇప్పుడు జగన్ తన పై చూపిస్తున్న వైఖరి వలన కొంత కాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారనీ అందులోను ఈ సారి అక్కడ నుంచి జగన్ వైసీపీ అభ్యర్థిగా కొండా నాగార్జున రెడ్డిని బరిలో దింపేందుకు వెంకట రెడ్డిని పక్కన పెట్టేసారని తెలుస్తుంది.అందుకే ఇక చేసేదేమీ లేక వేరే పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.