బాబు సొంతూరులో..ఏడుస్తూ వైసిపికి కీలక నేత గుడ్ బై..!

Tuesday, December 5th, 2017, 02:45:56 AM IST

చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఇటీవల ఎక్కువైనా వలసల పరంపర కొనసాగుతూ వైసిపి కీలక నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ వీడుతున్నపుడు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అవమానాలు భరించలేకే తాను వైసిపిని వీడుతున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీలో తనకు ఎదురైన అవమానాల గురించి రాజీనామా లేఖలో రాసి జగన్ కు పంపానని అన్నారు.

వైఎస్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి ఎంతో మధన పడ్డానని సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో తనకు పార్టీ ఉన్న స్థాయి, ఇప్పుడు తన ప్రతిష్టని దిగజార్చడానికి జరుగుతున్న పరిణామాలని ఆయన ప్రస్తావించారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో జగన్ పార్టీ స్థాపించగానే అందులో చేరానని, దానికి నాకు దక్కిన ప్రతిఫలం ఇదేనా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్యం రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆయనకు బిజెపి నుంచి కూడా ఆహ్వానం ఉందని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments