మూవీ రివ్యూ : అంతరిక్షం

Friday, December 21st, 2018, 06:26:22 PM IST

తెలుగు సినీ పరిశ్రమకు మెగా వారసుడిగానే పరిచయం అయినా తన మొదటి సినిమా “ముకుంద” వంటి సినిమాతో మెగా హీరోలలో మాస్ కోణానికి భిన్నంగా తనలోని క్లాస్ టచ్ తో పరిచయం అయ్యి మంచి మార్కులనే వరుణ్ తేజ్ కొట్టేసాడు.ఆ తర్వాత కొన్ని సినిమాలతో నిరుత్సాహపరిచినా సరే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ క్రమక్రంగా తన విజయాలకు దారి వేసుకుంటున్నాడు.అదే విధంగా “ఘాజీ” వంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నటువంటి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఇప్పటి వరకు తెలుగులో రానటువంటి అంతరిక్ష కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “అంతరిక్షం 9000 KMPH”.టీజర్ తోనే ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది.ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే వరుణ్ తేజ్(దేవ్) కొన్ని సంవత్సరాల క్రితం భూమి యొక్క ఉపగ్రహం చంద్రుని పై ఒక మిషన్ ను పూర్తి చెయ్యడానికి ఒక అనుకోని పరిస్థితుల్లో వెళ్లాల్సొస్తుంది.అయితే అదే సమయంలో ఆ మిషన్ ను పూర్తి చెయ్యడానికి కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి.అయినా సరే వాటి అన్నిటిని దాటుకొని వరుణ్ ఆ సమస్యలను ఎదుర్కొని ఎలా అయినా పరిష్కరించాలి అనుకుంటాడు.అలాగే తాను అప్పటికే ఒక మిషన్ ను పూర్తి చేసే పనిలో ఉంటాడు.మరి ఏక కాలంలో ఈ రెండు మెషిన్లను వరుణ్ తన బృందంతో విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడా అదే సమయంలో తనకి అంతరిక్షంలో ఎదురైన సమస్యలు ఏమిటి వాటిని వరుణ్ దాటగలిగాడా లేదా అన్నది వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమా ప్రారంభమే అంతరిక్షంలోని సన్నివేశాలతో మొదలవుతుంది.అప్పుడు కనిపించే విజువల్స్ మాత్రం ఔరా అనిపిస్తాయి.మొదట్లో కథ కాస్త మెల్లగానే సాగినా ఆసక్తికరంగా ఉంటుంది.హీరో వరుణ్ తేజ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి గతానికి మరియు ప్రస్తుతాని సంబంధించి వచ్చిన సీన్లు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి.ఇక హీరోయిన్ అదితి రావ్ వ్యోమగామిగా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ గర్ల్ ఫ్రెండ్ గా,ఆమె తండ్రి రెహమాన్ తదితరులు పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి.ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన మొదటి సినిమాతోనే మంచి కథాంశం ఎంచుని వైవిధ్యమైన దర్శకునిగా మార్కులు కొట్టేసారు.అదే తరహాలో ఇప్పుడు కూడా తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎవరు ముట్టుకోని సబ్జెక్టు తీసుకొని సాహసం చేశారనే చెప్పాలి.అయితే ఫస్టాఫ్ లో కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాల నుంచి పర్వాలేదనిపించే స్థాయిలో ఉండి సెకండాఫ్ లో ఏం జరగబోతుంది అనే విధంగా ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకెళ్తుంది.

ఇక సెకండాఫ్ కి వచ్చినట్టయితే సెకండాఫ్ కూడా ప్రారంభమే కాస్త ఆసక్తిగా ఫస్టాఫ్ లో చూపిన విధంగా అంతరిక్షంలో మొదలవుతుంది.అంతరిక్షయానం చేసినటువంటి వరుణ్ టీమ్ లో వారిలో వారికే కొన్ని ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం వలన కథ ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది.సెకండాఫ్ లో వచ్చే విజువల్స్ పరంగా చెప్పాలి అంటే దర్శకుని యొక్క కమిట్మెంట్ ని మెచ్చుకొనే తీరాలి. సినిమా చూస్తున్నంతసేపు ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ కాస్త బాగుంది అనే విధంగా ప్రేక్షుకులు ఫీల్ అవుతారు.సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఛాలెంజింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఇంకా కుతూహలాన్ని పెంచుతాయి.దర్శకుడు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను ఎంచుకున్నా సరే దాన్ని అంత ఆసక్తికరంగా మలచడంలో కాస్త ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.అక్కడక్కడా కథ కాస్త మెల్లగా తీసుకెళ్లడం వలన ప్రేక్షకుడికి ఆసక్తి కాస్త లోపిస్తుంది,ఈ విషయంలో దర్శకుడు కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుణ్ణు.

ప్లస్ పాయింట్స్ :

వరుణ్ తేజ్ నటన,
అద్భుతమైన విజువల్స్,
దర్శకుడు ఎంచుకున్న కథాంశం.

మైనస్ పాయింట్స్ :

సాగదీతగా సాగే ఫస్టాఫ్,
కథలో కొన్ని లోపాలు.

తీర్పు :

మొత్తానికి “ఘాజీ” వంటి అద్భుత చిత్రాన్ని అందించిన సంకల్ప్ నుంచి వరుణ్ తేజ్ తో ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు ఎంచుకొని సబ్జెక్టు ను వీరు ఎంచుకొని ఒక్కసారిగా తెలుగు ప్రేక్షుకులను ఆకర్షించారు.కానీ దాన్ని దర్శకుడు అనుకున్న రీతిలో తెరకెక్కించడంలో మాత్రం ఈ సారి కాస్త తడబడ్డారనే చెప్పాలి.మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

Rating : 2.5/5

REVIEW OVERVIEW
Antariksham Movie Review In Telugu