చీమలకు శుచి శుభ్రత ఎక్కువే..!

Thursday, February 19th, 2015, 10:13:08 PM IST


చీమల పేరు వినగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది క్రమశిక్షణ… కష్టపడి పనిచేయడం. చీమలపై ఇప్పటివరకు ఎంతో మంది ఎన్నో రకాల పరిశోదనలు నిర్వహించారు. అయితే,ఇటీవలే జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. చీమలు క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడంతో పాటు శుచి శుబ్రతను ఎక్కువగా పాటిస్తాయని వారి పరిశోధనలో తేలింది. చీమలు తమ పుట్టలలో మలవిసర్జన ప్రత్యేకంగా స్థలాన్ని కేటాఇస్తాయని.. ఆ ప్రదేశంలో మాత్రమే చీమలు మలవిసర్జన జరుపుతాయని పరిశోధనలో వెల్లడయింది. ప్రతిది ఇదేవిధంగా చేస్తుందని.. ఏవీ కూడా క్రమం తప్పవని చీమలపై పరిశోదన చేసిన పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఇక చీమలు ఎక్కడైతే బాత్ రూములుగా ఉపయోగిస్తున్నాయో… ఆ ప్రదేశాలలో మలవిసర్జన తప్ప మరే పదార్ధాలు ఉండవని తాజా పరిశోధనలో వెల్లడయింది. బహుశా అందుకే అంటారు చీమలను చూసి మనుషులు నేర్చుకోవలసింది ఎంతో ఉన్నదని. ఇది ముమ్మాటికి నిజమే.